జన్‌ధన్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌..!

-

ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన కింద జన్ ధన్ ఖాతాను తెరిస్తే ఎన్నో లాభాలు ఉంటాయి. ఒకవేళ కనుక మీరు ఇప్పటికి ఓపెన్ చేయలేనట్టైతే త్వరలో ఈ అకౌంట్‌ తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన రెండో స్టేజ్ ని మొదలు పెట్టనుంది.

47 కోట్ల మందికి పైగా బ్యాంకు ఖాతాలు ఫస్ట్ స్టేజ్ లో ఓపెన్ చేసారు. ప్రస్తుతం దీనిలో ఇందులో రూ.1.75 లక్షల కోట్లు జమ అయ్యాయి. ఇప్పుడు జన్ ధన్ ఖాతాలో జమ చేసిన డబ్బును అనుసంధానించాలని… మంచి రాబడి వస్తుంది. ఇది ఇలా ఉంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, మ్యూచువల్ ఫండ్, ఎస్‌ఐపీ, ఈ-గోల్డ్ స్కీమ్‌లను తీసుకు రావాలని ప్రభుత్వం చూస్తోంది.

చిన్న మొత్తాలు, పెట్టుబడిదారులకు నష్టం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం దీని మీద పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కేంద్రం అంటోంది. బిజినెస్ కరస్పాండెంట్లు, బ్యాంకు అధికారులు జన్ ధన్ ఖాతాదారులకు పెట్టుబడి అవకాశాలను తెలిపే అవగాహనని ఇస్తారట. అలానే సెబీ, ఆర్‌బీఐ మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయట.

 

 

Read more RELATED
Recommended to you

Latest news