హైదరాబాద్: జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. లిఖిత పూర్వక వాదనలు సమర్పించేందుకు గతంలో సీబీఐ నిరాకరించిన విషయాన్ని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో లిఖిత పూర్వక వాదనలు సమర్పించేందుకు సీబీఐ పది రోజుల గడువు కోరింది. లిఖిత పూర్వ వాదనలు వెంటనే కోర్టుకు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 26కు వాయిదా వేసింది.
కాగా అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. అయితే జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసు విచారణ పలుమార్లు వాయిదా పడింది. తాజాగా మరోసారి ఈ పిటిషన్ విచారణను సీబీఐ కోర్టు వాయిదా వేసింది.