ఏపీకి రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సబ్మిట్ లో మాట్లాడిన సీఎం, ‘దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు అన్నీ ముందుకు వస్తున్నాయి. 340 సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. వీటి విలువ రూ. 13 లక్షల కోట్లు. తొలి రోజు 92 MOU లు కుదిరాయి. వీటి ద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది’ అని ప్రకటించారు.
అలాగే ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. విశాఖే పరిపాలనా రాజధాని అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని వివరించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. పెట్టుబడులకే కాదు పకృతి అందాలకు విశాఖ నెలవు అన్నారు. ఇండియాలో అతి కీలకమైన రాష్ట్రం ఏపీ అని వివరించారు. ఆరు రేవులు రాష్ట్రమంతా విస్తరించి ఉన్నాయని తెలిపారు. విశాఖపట్నం చిన్న ఎకనామిక్ హబ్.. సెప్టెంబర్‌లో వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్.. మీ పెట్టుబడులకు ఆకర్షణీయమైన సిటీ వైజాగ్ అని వివరించారు సీఎం జగన్.