ముసలాయన అంటూ జగన్..రివర్స్ అవుతుందా?

-

చంద్రబాబు టార్గెట్ గా జగన్ చేసే ప్రతి విమర్శకు ఓ లాజిక్ ఉంటుందనే చెప్పాలి. ఏదైనా విమర్శ చేశారంటే దాని వెనుక ఉన్న రాజకీయం వేరే ఉందనే అనుకోవచ్చు. ఆ మధ్య పొత్తుకు సంబంధించి దమ్ముంటే 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని బాబు, పవన్‌కు జగన్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అంటే అక్కడ సవాల్ కు రెచ్చిపోయి..వారు ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి తమకు లబ్ది జరుగుతుందనేది జగన్ ఉద్దేశం. కానీ జగన్ సవాల్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు.

ఇక ఈ మధ్య జగన్..చంద్రబాబుని ఉద్దేశించి ముసలాయన అని అంటున్నారు. వాస్తవానికి బాబు వయసు 74 ఏళ్ల వరకు ఉంది. అందుకే అన్నారని అనుకోవడానికి లేదు. దీనివెనుక వేరే రీజన్ ఉంది. తాజాగా మార్కాపురం సభలో కూడా జగన్..బాబుని ఉద్దేశించి కామెంట్ చేశారు. ఇప్పుడు జగన్ ఇస్తున్నట్లుగా ఆ ముసలాయన పాలనలో ఎందుకు మీ ఖాతాల్లో నగదు రాలేదో ఆలోచించాలని, సమయంలో ఎవరు తిన్నారు. ఎవరు దోచుకున్నారో నిలదీయాలని ప్రజలకు సూచించారు.

 ys-jagan-chandrababu-

అంటే లాజికల్ గా జగన్ విమర్శ చేశారు. కాకపోతే అలా ముసలాయన అనడం వల్ల వైసీపీని అభిమానించే వారు సంతోష పడతారేమో గాని..సాధారణ జనం హర్షించడం కష్టం. పుట్టాక ఎవరైనా ముసలోళ్ళు అవ్వాల్సిందే. అలాగే బాబు పని అయిపోయిందనే కోణంలో జగన్..ముసలాయన అంటున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఇప్పుడు పథకాలకు డబ్బులు ఇచ్చాను..అప్పుడు ఆ డబ్బులు ఏమయ్యాయని అంటున్నారు. అయితే అప్పుడు పథకాలు వచ్చాయి..ఈ స్థాయిలో రాలేదు గాని..కొంతవరకు వచ్చాయి..అదే సమయంలో అభివృద్ధి జరిగింది.. రోడ్లు, తాగునీరు, డ్రైనేజ్ లాంటి వసతులు మెరుగుపడ్డాయి. ఇప్పుడు కేవలం పథకాలకు డబ్బులు ఇవ్వడమే అని టి‌డి‌పి శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి. ఇక తాము ఏం చేశామో అక్కాచెల్లెళ్ళుకు తెలుసని అంటున్నారు..పథకాలు తెలుసు..అదే సమయంలో పన్నుల భారం కూడా తెలుసని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news