విశాఖలో మరో జూబ్లీహిల్స్ ను తయారు చేద్దాం : సీఎం జగన్

-

చిరంజీవి బృందం తో భేటీ లో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌ని విశాఖకు కూడా విస్తరించండని.. విశాఖలో స్టూడియోలకు స్థలాలు ఇస్తామని సిఎం జగన్ పేర్కొన్నారు. తెలంగాణతో పోలిస్తే ఇండస్ట్రీకి 60 శాతం ఆదాయం ఏపీ నుంచే వస్తుందని చెప్పారు. విశాఖలో జూబ్లీహిల్స్ తరహా ప్రాంతాన్ని క్రియేట్ చేద్దామని.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో పోటీ పడే సత్తా విశాఖకు ఉందని వెల్లడించారు.

CM Jagan Mohan Reddy
CM Jagan Mohan Reddy

సినిమా అంటేనే శుక్రవారం, శనివారం, ఆదివారం.. ఆ తర్వాత వారం ఆడగలిగితే సూపర్‌హిట్‌ అవుతుందన్నారు.ఆ పాయింట్‌ అర్ధం చేసుకున్నామని.. అదే సమయంలో అది అందరికీ వర్తిస్తుందని పేర్కొన్నారు. చిన్న సినిమాలకు అవే రేట్లు వర్తిస్తాయని.. వారిక్కూడా మంచి ఆదాయాలు వస్తాయన్నారు.
ఐదో ఆట వల్ల ఇండస్ట్రీకి కూడా మేలు జరుగుతుందని.. మల్టీప్లెక్స్‌లును కూడా మంచి ధరలతో ట్రీట్‌ చేయడం జరుగుతుందని చెప్పారు. మీరు చెప్పిన అన్ని విషయాలను మనసులో పెట్టుకున్నానని.. మీ అందరికీ సంతోషం కలిగించినందుకు ఆనందంగా ఉందని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news