సెంటిమెంట్ అస్త్రం..కేటీఆర్ తగ్గట్లేదుగా!

-

ఏదో కొన్నిసార్లు మాత్రమే సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవుతుంది…కానీ అన్నివేళలా సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదనే చెప్పాలి…కానీ  తెలంగాణలో టీఆర్ఎస్ మాత్రం ఇంకా తెలంగాణ సెంటిమెంట్‌ని వాడుకుంటున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే సెంటిమెంట్‌తో రెండుసార్లు అధికారంలోకి వచ్చారు…మూడో సారి కూడా అధికారంలోకి రావడానికి టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా పార్లమెంట్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు రాజకీయ రంగు పులమడానికి టీఆర్ఎస్ సిద్ధమైంది.

తాజాగా ఆంధ్రప్రదేశ్ విభజనపై మోదీ మాట్లాడారు…కాంగ్రెస్ పార్టీ విభజన సరిగ్గా చేయలేదనే అంశాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ హడావిడిగా విభజించిందని, తాము తెలంగాణాకు వ్యతిరేకం కాదని, విభజన జరిగిన తీరు ఎలా ఉందనేది చాలా ముఖ్యమైన విషయమని అన్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయిందని, సరైన విధంగా విభజన జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. పార్లమెంటులో తలుపులు వేసి, మైక్‌లు కట్ చేసి, బిల్లును ఆమోదించారని, ఇదేనా ప్రజాస్వామ్యం? అని ప్రశ్నించారు.

అయితే తెలంగాణకు వ్యతిరేకం కాదని మోదీ చెప్పారు…అయినా సరే టీఆర్ఎస్ నేతలు మళ్ళీ తెలంగాణ సెటిమెంట్‌ని తెరపైకి తీసుకొచ్చారు. ప్రధాని తెలంగాణ ప్రజలను, పోరాటాన్ని అవమానించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ వ్యాఖ్యలను ఖండించారు…క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ప్రధాని తరచూ తెలంగాణ ఉద్యమాన్ని అవమానించడం చాలా దారుణమని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మోదీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు  కేటీఆర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో బీజేపీ దిష్టిబొమ్మలను దహనం చేయాలని, నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు. అంటే మళ్ళీ ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్‌ని తెరపైకి తీసుకురావడం కోసమే…కేటీఆర్ ఈ రకంగా నిరసనలకు పిలుపునిచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోదీ కేవలం..విభజన తీరునే ప్రశ్నించారు తప్ప…తెలంగాణ ఇవ్వడాన్ని తప్పుబట్టలేదు…కానీ టీఆర్ఎస్ మాత్రం తెలంగాణ సెంటిమెంట్‌ని రగల్చడానికి మళ్ళీ ప్రయత్నిస్తుంది. మరి ఈ సెంటిమెంట్ అస్త్రం ఏ మేర వర్కౌట్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news