ఇంట్లో ఉండే వరల్డ్ టూర్ చూట్టేద్దామా..ఆశ్చర్యం కలిగించే ప్రపంచ నిజాలు ఇవే..!

-

ప్రపంచంలో ఎన్నో వింతలు దాగి ఉన్నాయి..మనకు తెలియనంత వరకూ, మనం చూడనంత వరకూ ఏదైనా కొత్తగానే అనిపిస్తుంది. కొన్ని నమ్మలేని నిజాలు ఉంటాయి…ఈరోజు ప్రపంచంలో కొన్ని అద్భుతమైన విషయాలు గురించి తెలుసుకుందాం.. ఓసారి అలా వరల్డ్ టూర్ వేసేద్దాం.. మన ఈ జర్నీ పూర్తయ్యేసరికి… ఏదో ఒక దగ్గర మీరు ఆకర్షితులు అవుతారు.

ఏ దేశాల్లో దీవులు ఎక్కువగా ఉన్నాయి?

ఎక్కువ దీవులు స్వీడన్‌లో ఉన్నాయి. అక్కడ మొత్తం 2,67,570 దీవులున్నాయి. ఆ దేశ రాజధాని
స్టాక్‌హోమ్ కూడా 14 దీవుల సముదాయంగా ఉంది. నిజానికి ఇన్ని దీవులు ఉన్నాయని పేరుకే కానీ…ఈ దీవుల్లో చాలావరకూ సముద్ర మట్టాలు పెరగడం వల్ల ఇప్పుడు కనిపించట్లేదు. కొన్ని దీవులు జీవించేందుకు ఏమాత్రం అనుకూలంగా లేవు.. మనుషులు జీవించేందుకు అనుకూలంగా ఉన్న దీవులతో ఇండొనేసియా ఉంది. ఆ దేశంలో 17,508 దీవులు ఉండగా… 6000 దీవుల్లో ప్రజలు ఉంటున్నారు.

పరిమాణంలో ప్రపంచంలో అతి పెద్ద దేశం ఏది?

ఈ భూమిపై అతి పెద్ద దేశం రష్యానే. 10,563 చదరపు కిలోమీటర్లతో ఉన్న రష్యా.. ఇది పశ్చిమాన యూరోపియన్ బాల్టిక్ సముద్రం వరకూ విస్తరించి ఉంది. చెప్పాలంటే ఈ దేశం ఉత్తరార్థ గోళం పైభాగం చాలావరకూ ఇదే ఉంది. దీని సైబీరియన్ ఉత్తరం వైపున ఆర్కిటిక్ సర్కిల్‌ని టచ్ చేస్తోంది. ఈ ప్రపంచంలో రెండు ఖండాల్లో ఉన్న ఏకైక దేశం రష్యా మాత్రమే. ఇది ఇటు ఆసియా, అటు యూరప్‌లో ఉంది.

ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశం ఏది?

ప్రస్తుతానికి ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశం చైనా. ప్రస్తుత జనాభా సంఖ్య 140 కోట్లు. ఐతే… చైనాలో జనాభా సంఖ్య అనుకున్నంత వేగంగా పెరగట్లేదు. ఇండియాలో జనాభా సంఖ్య వేగంగా పెరుగుతోంది. అందువల్ల అతి త్వరలోనే చైనాని వెనక్కి నెట్టి ఇండియా టాప్‌కి చేరే అవకాశం ఉంది.. ఇప్పటికే ఇండియా టాప్‌కి చేరి వుంటుందనే అంచనా వేస్తున్నారు కొందరు నిపుణులు.. జనాభా కొరత వేధిస్తుండటంతో చైనా ప్రభుత్వం… ఎక్కువ మంది పిల్లల్ని కనమని స్వయంగా కోరుతున్నా… ప్రజలు ఆసక్తిగా లేరు. పిల్లల పెంపకానికి అధిక ఖర్చులు అవుతుండటంతో… ఒక సంతానమే చాలు అంటున్నారు అక్కడి ప్రజలు. ఇది ఆ దేశానికి తలనొప్పిగా మారింది.

 ప్రపంచంలో ఏ దేశంలో సాంస్కృతిక వైవిధ్యం ఎక్కువగా ఉంటుందంటే.

ప్రపంచంలో ఎక్కువ సాంస్కృతిక వైవిధ్య ఉన్న దేశం… పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్..కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని అమెరికా సొంతం చేసుకుందని అంటున్నారు. ఎందుకంటే… అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో రకరకాల కల్చర్లు, సంప్రదాయాలూ ఉన్నాయి. ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలు అమెరికాలో ఉంటున్నారు. దాదాపు 200 రకాల సంస్కృతులు అమెరికాలో కనిపిస్తున్నాయి. టొరంటో, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, శాన్‌ఫ్రాన్సిస్కో నగరాల్లో భిన్న రకాల సంస్కృతులు కనిపిస్తాయి.

ఎక్కువ మంది పర్యాటకులు వెళ్తున్న దేశం

UNWTO ప్రపంచ టూరిజం ప్రకారం… అందమైన యూరప్ దేశం ఫ్రాన్స్‌కి 2018లో ఎక్కువ మంది పర్యాటకులు వెళ్లారని తేలింది.. ముఖ్యంగా ప్యారిస్ నగరం చూడాలని చాలా మంది పర్యాటకులు కోరుకుంటారు. మనకు కూడా ప్యారిస్ వెళ్లాలనే డ్రీమ్ ఉంటుంది కదా…. ఫ్రాన్స్ జనాభా అంతా కలిపి 6.7 కోట్లే. కానీ ఏటా 8.9 కోట్ల మంది పర్యాటకులు ఆ దేశానికి వెళ్తున్నారట. చీజ్, వైన్‌కి ఇక్కడ ప్రత్యేక గుర్తింపు ఉంది. వీటన్నింటికీ మించి ఈఫిల్ టవర్ ప్రపంచ పర్యాటకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫ్రాన్స్ తర్వాతి స్థానంలో స్పెయిన్ ఉంది. అక్కడకు ఏటా 8 కోట్ల మంది పర్యాటకులు వెళ్తున్నారు.

ఏడాదిలో ఏ దేశంలో ఎక్కువగా వర్షం పడుతోంది?

 భూమధ్య రేఖ దగ్గర ఎక్కువ వర్షం పడుతోంది. ఏటా 3000 mm వర్షంతో కొలంబియా… భూమిపై అత్యంత వర్షం పడే దేశంగా ఉంది. దీని తర్వాత సావో టోమ్, ప్రిన్సిప్, పాపువా న్యూగినియా ఉన్నాయి. ఈ ప్రాంతాలను చూసేందుకు వర్షం పడని ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వస్తారట. దానికి తోడు… కొలంబియా వాతావరణం కూడా కొంత ప్రత్యేకంగా కనిపిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది.

జనాభాను లెక్కల్లో ప్రపంచంలో అతి చిన్న దేశం ఏది?

ప్రపంచంలో అతి తక్కువ జనాభా కలిగిన చిన్న దేశం వాటికన్ సిటీ. ఇది పోప్ హోమ్ సిటీ. ఇది రోమ్ నగరంలో… మధ్యలో ఉంటుంది. అంతా కలిపి 0.19 చదరపు మైలు (0.30 కిలోమీటర్) మాత్రమే ఉంటుంది. అంటే చిన్న గ్రామం, చిన్న పట్టణ కేంద్రంలా ఉంటుంది. ఇక్కడ జనాభా సంఖ్య చాలా తక్కువ. పర్మనెంట్‌గా ఉన్న వారు 800 మంది మాత్రమే. వీరిలో 450 మంది వాటికన్ సిటీ పౌరులు. ఇది చిన్న నగరమే కానీ… ఏటా దీన్ని చూసేందుకు 50 లక్షల మంది వరకూ పర్యాటకులు వస్తున్నారు. ఇక పోప్‌ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఈ సిటీలో సిస్టిన్ ఛాపెల్, సెయింట్ పీటర్స్ బాసిలికాను పర్యాటకులు తప్పక చూస్తారు.

ఏడాదిలో ఏ దేశంలో వర్షం తక్కువగా పడుతోంది?

కొలంబియాకి పూర్తి భిన్నమైన దేశాలున్నాయి. అక్కడ వర్షం అన్నది పడటమే కష్టమట. వర్షా కాలంలో కూడా చినుకు కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిందే. ఇలాంటి దేశాలు పెద్ద ఎడారుల్లో ఉన్నాయి. ఎడారి వాతావరణం కారణంగా అక్కడ వర్షాలు పడట్లేదు. ఇవి మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికాలో ఎక్కువగా ఉన్నాయి. వాటిలో ఈజిఫ్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా ఎప్పుడూ పొడిగానే ఉంటాయి. అందుకే ఈ దేశాలు నీటి వాడకం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాయి. మనకు పెట్రోల్, డీజిల్ ఎంత ఖరీదో…వారికి నీరు అంత ప్రాధాన్య అంశంగా ఉంటోంది.

ఏ దేశాల్లో ఎయిర్‌పోర్టులు ఎక్కువగా ఉన్నాయి?

అమెరికాలో ఏకంగా 13,500కు పైగా ఎయిర్‌పోర్టులు ఉన్నాయి తెలుసా..మీరు ప్రైవేట్ ఎయిర్‌ఫీల్టులను కూడా కలిపితే… ఈ సంఖ్య ఏకంగా 19,000 కంటే ఎక్కువే ఉంటుంది. అమెరికా తర్వాత సెకండ్ పొజిషన్‌లో బ్రెజిల్ ఉంది. ఐతే… అక్కడ 4వేలకు పైగా విమానాశ్రయాలు ఉన్నాయి. ఇదేమీ చిన్న సంఖ్య కాదు.

ఏ దేశాల్లో ఎక్కువ బీచ్‌లు, తీర ప్రాంతాలున్నాయి?

ఈ విషయంలో కెనెడా ముందుంది..ఆ దేశానికి అతి పెద్ద తీర ప్రాంతం ఉంది. ఆర్కిటిక్ ఆర్చిపెలాగో వల్ల, ఉత్తర గోళం వైపు విస్తరించడం వల్ల ఆ దేశానికి 2,02,080 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అంత ఉన్నా… అందులో చాలా వరకూ బీచ్‌లాగా లేదు. అంటే… అక్కడికి వెళ్లి పర్యాటకులు ఎంజాయ్ చేసేలా చాలా ప్రాంతాలు లేవు. బీచ్ టూరిజంకి వెళ్లాలనుకునేవారికి ఇండొనేసియా బాగా సెట్టవుతోంది. అక్కడ 99,083 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అక్కడి ఇసుక బీచ్‌లు పర్యాటకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. పైగా అక్కడి 6వేల దాకా దీవులు కూడా పర్యాటకులకు స్వర్గధామంలా ఉంటాయి.

ఏ దేశంలో ఎండ ఎక్కువగా ఉంటుంది?

ఎక్కువగా ఎండపడే దేశాలను లెక్కలోకి తీసుకుంటే… అమెరికా, ఈజిఫ్ట్ ఉన్నాయి. ఈ రెండు దేశాల్లో ఎక్కువ గంటలపాటూ సూర్యుడి ఎండ పడుతుంది. ఇక అరిజోనా, నెవాడా రాష్ట్రాల్లో ఎండబాగా ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో సంవత్సరమంతా ఎండ పడుతుంది. ఎవరైనా ఎండ పడే ప్రాంతాలకు వెళ్లాలి అనుకుంటే… వారికి ఇవి సరిగ్గా సెట్ అవుతాయి.
ఇవి ప్రపంచంలో కొన్ని వింతైన విషయాలు..కొత్త టాపిక్స్ తెలుసుకునే ఆస్తకి ఉన్న మీ ఆత్మీయులకు మాత్రం ఆర్టికల్ షేర్ చేయడం మర్చిపోకండే..!

Read more RELATED
Recommended to you

Latest news