ఏపీలో గన్నవరం గొడవ గత వారం పది రోజులుగా హాట్ హాట్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇక్కడ నుంచి టీడీపీ తరపున గెలిచిన వల్లభనేని వంశీమోహన్ టీడీపీ నుంచి సస్పెండ్ చేయబడడంతో పాటు ఆయన తాను వైసీపీలోకి వెళతానని చెప్పడం.. అటు టీడీపీ అధిష్టానాన్ని ఓ రేంజులో టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేయడంతో గన్నవరం రాజకీయాలు మాంచి కాకమీదున్నాయి.
ఇక తాజాగా నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు జిల్లాకే చెందిన మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో కలిసి సీఎం జగన్‌ను కలిశారు. ఆ తర్వాత వారందరూ ఒకే కారులో వెళ్లిపోయారు. వంశీ పార్టీలో చేరికను కూడా వైసీపీ కార్యకర్తలు, యార్లగడ్డ అనుచరులు తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం మీడియాతో మాట్లాడిన వెంకట్రావు వంశీ వ్యాఖ్యలకు తాను ఇప్పుడు స్పందించను అని.. ఆయన పార్టీలో చేరిన తర్వాతే మాట్లాడతానని చెప్పారు.
జగన్‌ను కలిసినప్పుడు వంశీ ప్రస్తావన రాలేదని కూడా యార్లగడ్డ చెప్పారు. ఇదిలా ఉంటే బుధవారమే వంశీ వైసీపీ కీలక నేత, వైసీపీ పొలిటికల్ కమిటీ సభ్యుడు దుట్టా రామచంద్రరావుతో భేటీ అవ్వడం ఆసక్తిగా మారింది. 2014 ఎన్నికల్లో వంశీ వైసీపీ నుంచి పోటీ చేసిన దుట్టాపై విజయం సాధించారు. ఉప ఎన్నికలు వస్తే ఏం చేయాలనే అంశం మీదే వంశీ దుట్టాతో చర్చించినట్టు కూడా టాక్..?
ఇక జగన్ గన్నవరం విషయంలో క్లారిటీకి వచ్చేసినట్టు టాక్. ఉప ఎన్నికలు వస్తే వంశీకి ఎమ్మెల్యే సీటు ఇచ్చి.. పార్టీకి కష్టకాలంలో నిలబడ్డ వెంకట్రావుకు ఎమ్మెల్సీ ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలిసింది. అయితే ముందుగా వెంకట్రావుకే ఎమ్మెల్యే సీటు ఇచ్చి.. వంశీకి రాజ్యసభ ఇస్తారని వార్తలు వచ్చాయి. అయితే మాస్‌లో బలమైన ఫాలోయింగ్ ఉన్న వంశీకే ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని ఫైనల్‌గా జగన్ డెసిషన్ తీసుకున్నట్టు సమాచారం. ఇక ఇప్పుడు వంశీ రాజీనామా చేయడమే మిగిలి ఉంది.