ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు క్వారంటైన్ లో ఉండాలని జగన్ స్పష్టం చేసారు. ఇప్పుడు అదే బాటలో ఈశాన్య రాష్ట్రాలు నడుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కీలకమైన అసోం లో ఎక్కువగా కార్మికులు ఉంటారు. వాళ్ళు అందరూ కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్న సంగతి తెలిసిందే.
ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు అందరూ తమ సొంత ఊర్లకు తిరిగి వచ్చే అవకాశం ఉందని భావించిన అసోం సర్కార్… వాళ్లకు ఎంట్రీ పాస్ ఇవ్వాలని భావించింది. ఆ పాస్ తీసుకుని రావాలి. అందుకోసం ఒక వెబ్ సైట్ తెరుస్తారు. వాళ్ళు అందులో దరఖాస్తు చేసుకుని రావాల్సి ఉంటుంది. ఎవరిని పడితే వాళ్ళను రానీయరు. అవసరం అయితే క్వారంటైన్ లో ఉంచిన తర్వాత వాళ్ళను ఊళ్లకు వెళ్ళడానికి అనుమతిస్తారు.
ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. ఎవరిని కూడా రాష్ట్రంలో రానీయమని… కేంద్రం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి లేదని రాష్ట్రంలో రావాలి అంటే కచ్చితంగా నిభందనలకు అంగీకరించే రావాలని సూచించారు. ఇక ఈ బాటలోనే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా పయనించే అవకాశాలు కనపడుతున్నాయి. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.