విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతటా అభివృద్ధి జరగాలని అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ తీసుకున్న వికేంద్రీకరణ అంశం గురించి అసెంబ్లీలో జరుగుతున్న చర్చ జగన్ తీసుకున్న నిర్ణయాలను బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో వెనుకబడిపోయిన ఉత్తరాంధ్ర ప్రాంతం ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల కష్టాలు మొత్తం ఎగిరిపోయే విధంగా వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా సీఎం వైఎస్ జగన్ విశాఖపట్టణంలో పరిపాలన రాజధాని కట్టడానికి రెడీ అయినట్లే అన్ని విధాల ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందడానికి జగన్ సరికొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం.
అభివృద్ధి చెందిన విశాఖపట్టణంలో పరిపాలన రాజధాని ఏర్పడితే ఉత్తరాంధ్ర ప్రాంతంలో గిరిజన ప్రాంతాలుగా గత కొంత కాలం నుండి ఎటువంటి అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు తాజాగా జగన్ విశాఖలో పరిపాలన రాజధాని పెట్టడంతో కచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెనుకబడిపోయిన ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందటం గ్యారెంటీ అని ఇప్పటివరకు ఎటువంటి ఉపాధి లేక ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కూలీలు వలస వెళ్లే పరిస్థితి రాబోయే రోజుల్లో పూర్తిగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖ తో పాటు చుట్టుప్రక్కల ఉన్న జిల్లాలు కూడా అభివృద్ధి చెందటం గ్యారెంటీ అన్నట్లు జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజల కష్టాలు అన్నీ ఎగిరిపోయే విధంగా రాబోయే రోజుల్లో విశాఖపట్నం కేంద్రంగా జగన్ పరిపాలన మొదలు పెట్టనున్నట్లు సమాచారం.
ఇప్పటికే నౌకాశ్రయం, నౌకాదళం ఏర్పాటు కారణంగా ఇక్కడ మెట్రోపాలిటన్ కల్చర్ బాగా అభివృద్ధి చెందింది. ఇక ఇప్పుడు వీటికి రాజధాని కళ కూడా తోడవటంతో విశాఖ కు జాతీయ స్థాయి గుర్తింపు రావటం గ్యారెంటీ అనే టాక్ తాజాగా వినబడుతుంది.