బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవిని ఇచ్చిన జగన్

ఇవాళ ఏపీ ప్రభుత్వం నామినేటెడ్‌ పదవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే… నామినేటెడ్‌ పదవుల్లో కర్నూల్‌ జిల్లాకు చెందిన వైసీపీ పార్టీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్‌ కీలక పదవిని కట్టబెట్టారు. ఏపీ స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ గా బైరెడ్డి సిద్ధార్థ్ ను సీఎం జగన్‌ నియామకం చేశారు.

2019 ఎన్నికల్లో నంది కొట్ట్కూరు ఎమ్మెల్యే టికెట్‌ దక్కకపోయినప్పటికీ వైసీపీ పార్టీ గెలుపు కోసం బైరెడ్డి సిద్ధార్థ్ చాలా కృషి చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆర్థర్‌కు , బైరెడ్డి సిద్ధార్థ్ అభిప్రాయ భేదాలు ముదిరాయి. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ … తాజాగా బైరెడ్డి సిద్ధార్థ్ కి కీలక పదవిని ఇచ్చారు సీఎం జగన్‌.

అటు ఎమ్మెల్యే లకు జోడు పదవులు ఉండకూడదని.. సీఎం జగన్‌ కొత్త పాలసీని తీసుకువచ్చారు. అందులో భాగంగానే ఎమ్మెల్యే రోజా తో పాటు మాల్లాది విష్ణు, జక్కంపూడి రాజా పదవులను కోల్పోయారు. అయితే.. రోజా సైతం వైసీపీ పార్టీ ఏర్పాటు సమయం నుంచి ఉన్నప్పటికీ.. ఆమెకు ఉన్న నామినేటెడ్‌ పదవి నుంచి తొలగించారు.