ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ కరెంటు చార్జీలు పెంచారు అంటూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా భయంకరమైన కథనాలు ప్రసారం చేస్తుంది. ఇదే తరుణంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లు కూడా కరెంటు చార్జీల పెంపు అంటూ జగన్ సర్కార్ పై తీవ్రమైన విమర్శలు చేస్తోంది. అయితే తాజాగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు వినియోగదారుడి పై భారం పడకుండా పెరిగినట్లు వైసీపీ నేతలు తెలిపారు. జగన్ కరెంట్ చార్జీలు పెంచేసాడు అని వాగుతున్న టిడిపి వాళ్ళు ..అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2015 సంవత్సరంలో ఫిబ్రవరి మార్చి మాసంలో చార్జీలు పెంచారు.
ఆ సమయంలో 200 యూనిట్లు పెరిగితే కరెంటు ఛార్జీలు ఎక్కువ వేయడం జరిగింది. ఆ సమయంలో ప్రస్తుతం జగన్ పై ఏడుస్తున్న పత్రికలు.. 200 యూనిట్లపై చార్జీలు పెంచితేనే 92శాతం మందికి ఉపశమనం అంటూ తెగ ఊదరగొట్టడం జరిగాయి.
అలాంటిది ఇప్పుడు వైయస్ జగన్ 500 యూనిట్లు దాటిన వాళ్లకు రేటు పెంచితే.. సామాన్య జనాల నడ్డివిరుస్తున్నాడు అంటూ హెడ్డింగ్ లు పెడుతూ పచ్చ రాతలు రాయటం సిగ్గుచేటు అని వైసిపి పార్టీ నాయకులు జగన్ పై తాజాగా అమలు లోకి తీసుకు వచ్చిన కరెంటు చార్జీలపై ఎల్లో మీడియా మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. ఇటువంటి నిర్ణయం వల్ల రాష్ట్రంలో లక్షల్లో చాలామందికి కరెంటు చార్జీలు తగ్గినట్లు తాజాగా లెక్కలు చెబుతున్నాయి. ఇది సామాన్యుడి గవర్నమెంట్ అని హామీలు ఇచ్చి గాలికొదిలేసే గవర్నమెంట్ కాదని టిడిపి నేతలకు కౌంటర్లు వేస్తున్నారు.