కరోనా ఎఫెక్ట్.. ఆత్మహత్యాయత్నం చేసిన గాంధీ ఆసుపత్రి వైద్యుడు

-

కరోనా వైరస్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్నే గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఎక్క‌డ నుంచి ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుంది అనడానికి కచ్చితమైన ఆధారాలు లేవు. జంతువులు తినడం ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని కొందరు.. లేదు.. లేదు.. గాలి ద్వారా వ్యాపిస్తుందని మరికొందరు ఇలా ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్ ఇప్పటికే 20కి పైగా దేశాలకు వ్యాపించింది. ఇది ఇంకా ఎన్ని దేశాలకు వ్యాపిస్తుందో, ఇంకెంతమంది దీని బారిన పడతారో అంతుచిక్క‌డం లేదు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇటు భారతదేశ ప్రజల్ని కూడా భయాందోళనలకు గురి చేస్తోంది. ఇదిలా ఉంటే.. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మంగళవారం హైడ్రామా చోటుచేసుకుంది.

ఇప్పటికే హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో ఎంతో మంది కరోనా అనుమానాలతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఈ పరీక్షల్లో అన్ని కేసులు నెగెటివ్ అనే తేలినా… పాజిటివ్ కేసులు కూడా నమోదయ్యాయంటూ లీకులు వెలువడ్డాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి బాధ్యునిగా భావిస్తూ డాక్టర్ వసంత్ కుమార్ ను సస్పెండ్ చేసింది. మరో ఇద్దరు డాక్టర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గాంధీ అసుపత్రిలో వసంత్ కుమార్ హల్ చల్ చేశారు. తనను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ పెట్రోల్ డబ్బా పట్టుకొచ్చి ఆత్మహత్యాయత్నం చేశారు.దీంతో, తోటి వైద్య సిబ్బంది ఆయనను అడ్డుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు.

Read more RELATED
Recommended to you

Latest news