ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి దశ సమగ్ర భూ రీసర్వే సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. మొదటి దశలో 51 గ్రామాల్లో చేపట్టిన భూ రీసర్వే.. 12,776 మంది భూ యజమానుల 21, 404 భూ కమతాలకు సంబంధించి సర్వే చేసింది. 12,776 మంది భూ యజమానుల 21,404 భూ కమతాలకు సంబంధించిన 29,563 ఎకరాల భూముల్లో రీసర్వే జరిగింది. ఈ నేపథ్యంలోనే… 3,304 అభ్యంతరాలను పరిష్కరించింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.
ఇక తాజాగా సమగ్ర భూ రీసర్వే పథకాన్ని సమీక్షించనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టిన 51 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. 100 ఏళ్ళ తర్వాత దేశంలోనే మొదటి సారి సమగ్ర భూ రీసర్వే చేపట్టింది ఏపీ ప్రభుత్వం. ఇక దీనిపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు.