ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోన వైరస్ సమయంలో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఆయన ఒక ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే వారం రోజుల్లో మంత్రుల శాఖలను మార్చాలని భావిస్తున్నట్టు సమాచారం. కొత్త మంత్రులను కేబినేట్ లోకి తీసుకునే అవకాశం లేకపోయినా సరే ఆయన ఇప్పుడు కీలక శాఖల్లో సమర్ధవంతంగా లేని మంత్రులను తప్పించే అవకాశం ఉందని అంటున్నారు.
రెండు మూడు శాఖల్లో మార్పులు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇద్దరు మంత్రుల పని తీరు విషయంలో ముఖ్యమంత్రి చాలా అసహనంగా ఉన్నారని అంటున్నారు. అందుకోసమే ఆయన ఇప్పుడు వారి శాఖలను వేరే వారికి ఇవ్వాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వాళ్లకు ఇప్పటికే జగన్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారని సమాచారం. కరోనా వైరస్ నేపధ్యంలో కొందరు బయటకు రావడం లేదు.
దీనితో వాళ్ళకు ఇప్పటికే జగన్ పలు సూచనలు చేసినా సరే లాభం లేకపోవడం తో వారికి ఆ శాఖలను కాకుండా వేరే వారికి ఇవ్వాలని భావిస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఒక మంత్రి గారిని తన శాఖ నుంచి తప్పించే ఆలోచనలో జగన్ ఉన్నారని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. రెండు మూడు రోజుల్లో దీనిపై జగన్ నిర్ణయం తీసుకుని మార్చే అవకాశం ఉందని అంటున్నారు.