ఉద్యోగులకు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్…

-

లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వాలు తీవ్ర స్థాయిలో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఆర్ధిక నష్టాలు ఎదుర్కోలేక ఖర్చుల భారం భారీగా తగ్గించుకునే పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకి ఆదాయం పడిపోవడం భారం పెరిగిపోవడం తో ఇప్పుడు ఉద్యోగుల జీతాల్లో భారీగా కోతలు విధిస్తున్నాయి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు.

గత నెలలో ఉద్యోగుల జీతాల విషయంలో కోత విధించిన ఏపీ సర్కార్. ఈ నెలలో కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెలలో జీతాలు ఇచ్చినట్టే మేలో ఇచ్చే జీతాలు, వేతనాలు, గౌరవ వేతనాల్లో కూడా కోత ఉంటుందని ఏపీ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్లు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది, పోలీసులకు పూర్తి వేతనాలు ఇస్తామని మిగిలిన వారి జీతాల్లో భారీ కోత ఉంటుందని పేర్కొంది.

ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహా అన్ని రకాల రాజీకీయ ప్రతినిధులకు 100 శాతం కోత ఉంటుంది. అఖిల భారత సర్వీస్ ఉద్యోగులకు 60%. ఇతర అన్ని క్యాడర్ల ఉద్యోగస్తులకు 50% వాయిదా (నాల్గో తరగతి ఉద్యోగులు కాకుండా) నాల్గో తరగతి ఉద్యోగులకు 10% కోత ఉంటుంది. పెన్షనర్లకు వారు పనిచేసిన విభాగాల్లో దామాషా ప్రకారం వాయిదా వేస్తారు. మే నెలలో పెన్షనర్లకు ఎలాంటి కోత ఉండదని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news