అబ్బా రాత్రి లేట్ అయ్యింది.. అలా నిద్రపట్టిందో లేదో తెల్లారిపోయింది.. పొద్దున్నే లేపమన్నాగా.. ఛీఛీ. కార్ కీస్ వెతుకూ… ఈ పిల్లలొకటి ఇంట్లోకి తీసుకెళ్ళు. సార్.. హలో సార్ వస్తున్నా కొద్దిగా లేట్ అయ్యింది.. ఇదీ దాదాపుగా అందరి రొటీన్ జీవితం.. తిన్నామా.. ఆఫీస్‌కి వెళ్ళామా.. పడుకున్నామా.. ఇప్పుడు రోజులు మారాయ్ కరోనా వచ్చేసింది.. ఇంట్లోంచి బయటికి పొయ్యేదే లేదు.. ఇలాంటి రోజు జీవితంలో ఒక్క రోజు కూడా ఊహించి ఉండము కదా.. ఇలాంటి అవకాశం కరోనా అంటూ రావడం బాధగా ఉన్నా.. బాగుంది.. అవును నిజంగా బాగుంది..
నిజంగా మీ మనసు మీద ఒట్టేసుకుని చెప్పండి.. మీ ఇంట్లో వాళ్ళతో ప్రశాంతంగా ఎప్పుడైనా ఉన్నారా..? ఈ లాక్‌డౌన్ టైమ్‌ని కష్టంగా కాకుండా ఇష్టంగా మార్చుకోండి.. ఎలాగూ బాధపడ్డా కోపం తెచ్చుకున్నా ఏమీ చెయ్యలేరు కదా.. సో కరోనా లాక్ డౌన్ ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా అందంగా మార్చుకుందాం..
వ్యాయామం..
ఎప్పటిలా ఆఫీస్‌కి లేచినట్టుగా కాకుండా ప్రశాంతంగా ఉదయాన్నే లేచి ఇన్నాళ్ళ నుండి చెయ్యాలనుకుని చెయ్యలేని పనులు చేద్దాం.. అదేనండి వ్యాయామం , యోగా.. దీన్ని కొంచెం ఇష్టంగా చెయ్యాలని డిసైడ్ అవ్వాలి.. ఫస్ట్ రోజు బరువు ఎంత ఉన్నామో చూసుకోండి.. లేదంటే అద్దం ముందు నిలబడి మన లయ తప్పిన శరీరాన్ని పరిశీలించుకోండి.. లేదా ఒక సెల్ఫీ తీసుకోండి.. రోజూ చిన్న చిన్న ఆసనాలు.. యూట్యూబ్‌లో సెర్చ్ చేసి చూసి చెయ్యండి.. ఎన్నో యూట్యూబ్ ఛానెల్ వాళ్లు యోగా, వ్యాయామం ఇంకా సిక్స్‌ప్యాక్ ఎలా చెయ్యాలో సమాచారం ఇస్తున్నారు. పనిలో పనిగా గ్రీన్ టీ, లేదా వేడి నీటిలో తెనె వేసుకుని త్రాగండి.. మంచి ఆరోగ్యం కోసం ప్రయత్నం చెయ్యాలి. ఇలా రెండు మూడు రోజులకు మనకు మనలో మార్పు తెలుస్తుంది. పది రోజుల తర్వాత ఒక సెల్ఫీ ఇలా… లాక్‌డౌన్ పూర్తయ్యాక మరో సెల్ఫీ.. తేడా మనకే తెలుస్తుంది..
పిల్లలతో ఆడుకోండి..
ఆ చిట్టి మనసుకు తండ్రే హీరో కదా.. మరి మనం మన పిల్లల కోసం టైమ్ కేటాయించలేక పోయాం కదా.. మరి ఇప్పుడు ఆ టైమ్ వచ్చింది.. పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి.. వారికి ఏమంటే ఇష్టం, స్కూల్లో జరిగిన విషయాలు, నచ్చే కలర్ ఇలా అడుగుతూ, చిన్ని చిన్ని నీతి కథలు చెప్పండి.. ఇంకా వారితో మీ చిన్ననాటి సంగతులు చెప్పుకుంటూ సేదతీరండి. వారితో ఆటలు ఆడండి.. వీడియో గేమ్‌లు, క్యాండీ క్రష్, టెంపుల్ రన్ లాంటివి కాకుండా.. ఫిజికల్ గేమ్స్ లాంటివి.. అది మీ పిల్లలకు ఎంతో సంతోషాన్నిస్తుంది.. ఆఫీసుకెళ్ళెప్పుడు వాళ్ళు మీ వెంటడతారు కదా.. అది మీతో గడపాలనే వారి ఆశ.. సో అది తీర్చేద్దాం.. ఈ రోజులు మళ్ళీ రావు..
ఫ్యామిలీతో గడుపుదాం..
భార్యా, అమ్మ, నాన్న మనకోసం రోజూ ఎదురు చూస్తూ ఉంటారు.. ఎలాగూ రెగ్యులర్ రోజులు వాళ్ళతో ఉండం కదా.. ఇప్పుడు వారితో ఎక్కువ సమయం కేటాయించాలి.. వంట చేస్తున్నప్పుడు మీరూ ఓ చెయ్యవెయ్యటం.. లేదా అందరూ కలిసి తినడం చేస్తే ఇన్నాళ్ళ నుండి మిమ్మల్ని కోల్పోయిన వారి కళ్ళల్లో.. మాటల్లో సంతోషాన్ని మీరూ ఎంజాయ్ చెయ్యండి.. అమ్మ, నాన్నలకు టైమ్‌కి ట్యాబ్‌లెట్‌లు వేసుకోండని గుర్తు చెయ్యండి.. వీలైతే మీ చేత్తో ఇవ్వండి.. ఇన్ని రోజులు మీరు అమీర్ పేట్‌లో జాబ్ చేస్తున్నా అమెరికాలో జాబ్ చేసినంత బిజీగా ఉన్నారు కదా.. (ఇది కూడా చదవండి : పల్లె పిలిచింది.. ఊరికి కళ వచ్చింది!)
వయస్సు పెరిగిపోయినట్టు అయిపోయాం..
మీరు అందంగా కనిపించడం మీకు ఉత్సాహాన్ని, కాన్ఫిడెన్స్ ఇస్తుంది… పనిలో పడి మిమ్మల్ని మీరు అశ్రద్ద చేసుంటారుకదా.. మరి మీపై మీరు శ్రద్ధ పెనట్టండి.. నిజానికి మిమ్మల్ని మీరు గమనించుకోండి.. మీ వయసు కన్నా పెద్దగా కనిపిస్తున్నట్లు కనిపిస్తుంది కదా.. సో.. మన వెబ్‌సైట్ మనలోకం లో ఇచ్చే బ్యూటీటిప్స్ ఫాలో అవ్వండి.. ఇంకా ఆ యూట్యూబ్‌లో చూసి చిన్న చిన్న చిట్కాలు ప్రయత్నించండి.. తేడా కనిపిస్తే పాటించండి.. ఇవన్నీ మీ ఖాళీ టైమ్‌లోనే చెయ్యండి.. అసలు పని వర్క్ ఫ్రమ్ హోమ్‌కి ఇబ్బంది కాకుండా….
అప్‌డేట్ అవుదాం.. అవుడేట్ అవుతాం..
ఇన్నాళ్ళనుండి మనకు వచ్చిందాన్నే చేస్తున్నాము కదా.. కొంచెం అప్‌డేట్ అవుదాం.. లేదంటే ముందు ముందు అవుట్‌డేట్ అయిపోతాం.. మీ ఉద్యోగంలో ఎదుగుదలకు ఉపయోగపడే కోర్సులు ఏవైనా ఆన్‌లైన్‌లో నేర్చుకునేందుకు ప్రయత్నించండి… రాబోయే మార్పులను తెలుసుకోండి.. రోజుకో సాఫ్ట్‌వేర్ వస్తుంది.. అది మనల్ని అవుడేట్ చెయ్యకుండా దాని పని చూసేయండి.. పేరుకు పెద్ద మేనేజర్లు గానీ ఇంగ్లీష్ మాట్లాడాలంటే వణికిపోతారు.. ఇంగ్లీష్‌కి పదును పెట్టండి.. ఇంగ్లీష్ బోలో.. ఇది కూడా ఆన్‌లైన్‌లో దొరుకుతుంది.. భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే బెటర్.. బిజిన్‌స్ ప్లాన్ చేసుకోవడం కోసం మంచి బిజినెస్ ఐడియాస్ వెదకండి.
స్నేహితులను గుర్తు చేసుకుందాం
బిజీ జీవితం మనల్ని మనమే పట్టించుకోవడం మానేశాం.. అలాంటిది చిన్ననాటి మిత్రులను పలకరిస్తున్నామా..? రోజూ కలిసి రెండు పెగ్గులేసుకునే ఫ్రెండ్స్ దగ్గరి నుండి గ్యాప్ వచ్చిన మీ చిన్ననాటి స్నేహితులతో వీడియో కాల్.. గ్రూప్ కాల్ చేసి అలా పలకరించండి.. వాళ్ళ మంచి చెడులు తెలుసుకోండి.. ఒక్కో ఫ్రెండ్ మీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తే అలా అలా గతంలోకి వెళ్ళి రండి.. పనిలో పనిగా మీ పాత గర్ల్ ఫ్రెండ్‌ని కూడా తలుచుకోండి.. మళ్ళీ ఇంత ప్రశాంతంగా ఉండరు కదా… ( ఇది కూడా చదవండి : హైదరాబాదీ… ఏమి ఈ అజ్ఞానపు పోకడలు! )
ఇన్నిరోజులు ఎన్నో ఒత్తిళ్ళు.. అలసట.. ఉరుకుల పరుగుల ప్రపంచంతో పోటీ.. కరోనా ఇచ్చిన సదవకాశాన్ని వినియోగించుకుంటూ.. దేశ సేవ చెయ్యండి.. ఇక్కడ మనం బయటికి వెళ్ళకపోవడమే మనం దేశానికి చేసే సేవ.. మళ్ళీ ఆరోజులు వస్తాయి.. సో ఉన్న సమయంలో ఆనందంగా గడుపుదాం.. మనం అనుకున్నవన్నీ చేసి చూడండి.. మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో.. మళ్లీ వేల రెట్ల శక్తి వస్తుంది మళ్ళీ పని చేసుకోవడానికి..
-RK