చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటైనా ఉందా..? చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చేది వెన్నుపోటు పథకమే అంటూ సీఎం జగన్ చురకలు అంటించారు. ఇవాళ అసెంబ్లీ లో సిఎం జగన్ మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగం సందర్బంగా టీడీపీ యాంటీ సోషల్ ఎలిమెంట్సులా వ్యవహరించారని.. చంద్రబాబుకు ముఖం చెల్లకే సభకు రాలేదన్నారు. మూడేళ్ల కాలంలో సీఎం జగన్ తానిచ్చిన మాటను నిలబెట్టుకున్నారనే ఘనత దక్కింది.2019 ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ.. ఉప ఎన్నికల్లోనూ వైసీపీ విజయ ఢంకా మోగించిందని పేర్కొన్నారు.
కుప్పంలో కూడా ప్రజలు వైసీపీని ఆదరించారు… చంద్రబాబు పాలన బాగుందా..? జగన్ పాలన బాగుందా..? అని ప్రజలను అడగాలని వెల్లడించారు. అన్ని రంగాల్లోనూ.. అన్ని వ్యవస్థల్లోనూ తరచి చూస్తే.. టీడీపీ చేసిన చెడు.. వైసీపీ చేసిన మంచే కన్పిస్తోందని చెప్పారు.
జిల్లాల స్వరూపం మారుస్తున్నామని.. ప్రతి 6-7 నియోజకవర్గాలకో జిల్లాను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలనా సంస్కరణల్లో విజన్ ఎవరికి ఉందో అర్థమవుతోందని.. రాజధాని వికేంద్రీకరణ వద్దన్న వాళ్లు కూడా జిల్లాల వికేంద్రీకరణను స్వాగతిస్తున్నారని వెల్లడించారు. బాబుగారి బావ మరిది కూడా హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని అడిగారు… తన బావగారి పరిపాలనలో బాబుగారిని అడగకుండా.. వైసీపీని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. .