స్టీల్ ప్లాంట్ కోసం పోరాడతా.. సిఎం జగన్ కీలక వ్యాఖ్యలు !

-

ఈ రోజు విశాఖపట్నం వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్ కార్మిక సంఘం నాయకులు 14 మందితో గంటల ఇరవై నిమిషాలు భేటీ అయ్యారు. భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందన ఉద్యమానికి ఊపిరి పోసినట్లయిందని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో స్టీల్ ప్లాంటుకు అనుకూలంగా తీర్మానం చేస్తామని సీఎం చెప్పడం శుభపరిణామం అని వారు పేర్కొన్నారు. కేంద్రం ఆలోచనకి మార్పు వస్తుందని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారని అన్నారు. పోస్కో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లయితే శ్రీకాకుళం జిల్లా భావనపాడు లో గాని కృష్ణపట్నం లో గాని కడప లో గాని అవకాశం ఇస్తామని చెప్పారని వారు పేర్కొన్నారు.

jagan
jagan

అంతేకాక విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సపోర్ట్ చేస్తున్నామని సీఎం జగన్ అన్నారని పేర్కొన్నారు. మా డిమాండ్ లు అన్నిటికీ సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని,  అవసరమైతే అసెంబ్లీ లో తీర్మానం చేస్తామని చెప్పారని మీడియాతో పేర్కొన్నారు. అలానే  నిర్వాసితుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని మాట ఇచ్చారని కార్మిక సంఘాలతో పాటు ప్రభుత్వం ఉమ్మడిగా పోరాటం చేస్తుందని తెలిపారని అన్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news