కేసీఆర్ నాకు హామీ ఇచ్చారు ఎవరూ భయపడవద్దు;జగన్

-

కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ సిఎం వైఎస్ జగన్ స్పష్టం చేసారు. ఎక్కడ ఉన్న వాళ్ళను అక్కడ ఉంచకపోతే మాత్రం వ్యాధిని కట్టడి చేయలేమని జగన్ హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ లో ఉంచుతామని అన్నారు. 3 వారాలు జాగ్రత్తగా ఉంటేనే వైరస్ ని కట్టడి చేయగలమని జగన్ వ్యాఖ్యానించారు. నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం భారీ మూల్యం చెల్లిస్తామని అన్నారు.

నిన్న రాత్రి జరిగిన ఘటనలు చాలా బాధ కలిగించాయని, తెలంగాణా ఏపీ బోర్డర్ లో మన వాళ్ళు చాలా మంది ఉన్నారన్న ఆయన… ఏప్రిల్ 14 వరకు మనం ఇంటి నుంచి బయటకు రావొద్దని అన్నారు. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది అంటూ జగన్ వ్యాఖ్యానించారు. కేవలం మూడు వారాల పాటు కంట్రోల్ లో ఉండాలని జగన్ సూచించారు. ఏపీ లో ఉన్న వారికి ఇబ్బంది లేదని అన్నారు.

తెలంగాణాలో ఉన్న ఏపీ వారికి కెసిఆర్ హామీ ఇచ్చారని, ఫుడ్ షెల్టర్ ఏర్పాటు చేస్తారని కంగారు పడవద్దని జగన్ పేర్కొన్నారు. కరోనా అంటే చనిపోతారని వద్దని కోలుకుంటారని జగన్ వ్యాఖ్యానించారు. విదేశాల నుంచి 27, 819 మంది వచ్చారన్నారు. 4 చోట్ల క్రిటికల్ కేర్ ఆస్పత్రులు ఏర్పాటు చేసామని, 1902 అనే హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసామని జగన్ స్పష్టం చేసారు.

ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాలని, తాను కోరుతున్నా అని ఎవరికి ఏ ఇబ్బంది రాదని స్పష్టం చేసారు. దీన్ని కేవలం క్రమ శిక్షణ తో మాత్రమే మనం గెలుస్తామని అన్నారు. ఏపీలో పది పాజిటివ్ కేసులు తేలాయని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని నిఘాలో ఉంచుతామని అన్నారు. కాంటాక్ట్ ద్వారా వైరస్ సోకితే చాలా కష్టమని అన్నారు. ఇలాంటి వ్యాధి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు.

ఏప్రిల్ 14 వరకు ఎక్కడి వాళ్ళు అక్కడ ఉంటే కాంటాక్ట్ ట్రేసింగ్ చాలా సులువు అవుతుందని, ఎక్కడి వాళ్ళు అక్కడ లేకపోతే మాత్రం వ్యాధి తీవ్రతమవుతుందని అన్నారు. కేసులు పెరగకుండా ఉండాల౦టే క్రమశిక్షణ చాలా అవసరమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 213 వెంటిలేటర్లు ఏర్పాటు చేసామని జగన్ పేర్కొన్నారు. సరుకుల గురించి ఎవరూ కంగారు పడవద్దని జగన్ స్పష్టం చేసారు. కొంచెం కష్టమైనా అందరూ సహకరించాలని అన్నారు.

బార్డర్ వరకు వచ్చిన 44 మందిని తీసుకున్నామని అన్నారు. బియ్యం పాలు కూడా ప్రభుత్వమే అందిస్తుందని, మార్చ్ 29 నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ వాసులను తాము చూసుకుంటామని కెసిఆర్ చెప్పారని అన్నారు. ప్రభుత్వం తరుపు నుంచి చెయ్యాల్సింది అంతా చేస్తామని అన్నారు. వ్యవసాయ పనులు తప్పదు అనుకుంటేనే వెళ్ళాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news