జగన్ మరొక రివర్స్ గేర్ కంగారులో ఉద్యోగులు..!!

-

జగన్ సర్కార్ ఇటీవల తీసుకునే ప్రతి నిర్ణయం లో రివర్స్ గేర్ వేస్తూ వస్తోంది. దీంతో విపక్ష పార్టీలు జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇది రద్దు ల ప్రభుత్వం అనే పేరు పెట్టారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాటినుండి జగన్ పోలవరం పనుల్లో మరి ఇంకా కొన్ని పనుల్లో రివర్స్ టెండరింగ్ కి వెళ్లడం జరిగింది.

Image result for jagan

అయితే తాజాగా జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ తరహాలో రివర్స్ గేర్ వేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఉద్యోగులు తెగ కంగారు పడిపోతున్నారు. విషయంలోకి వెళితే ప్రభుత్వ ఉద్యోగుల్ల జీతాల పెంపు లో జగన్ సర్కార్ రివర్స్ వెళ్తుంది ఈసారి. చంద్రబాబు హయాంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల పై  రివర్స్ బ్రహ్మాస్త్రం విసిరింది. తెలుగుదేశం పార్టీ హయాంలో మహిళా శిశు సంక్షేమ కాంట్రాక్టు ఉద్యోగులకు మూడు వేల నుంచి ఏడు వేల వరకు జీతాలు పెరిగిన విషయం అందరికీ తెలిసిందే.

 

ఇటువంటి తరుణంలో ప్రభుత్వం నుండి ఇప్పటివరకు అందుకున్న పెరిగిన జీతం మొత్తం తిరిగి చెల్లించాలని జగన్ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో జగన్ సర్కార్ ఉద్యోగులకు ఆదేశించిన జీతాల రివర్స్ గేర్ కి మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అంత మొత్తం ఇప్పుడు మేము ఎక్కడ నుండి తేవాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై మండిపడుతున్నారు. అయినా సరే చంద్రబాబు పెంచితే ఈయన వచ్చి తగ్గించడం ఏంటని మరి కొంతమంది ఉద్యోగులు జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news