మందుబాబుల‌కు మ‌రో షాక్‌.. పెరిగిన ధరలు ఎంతంటే..?

-

ఏపీలో మందుబాబుల‌కు వ‌రుస‌గా షాకుల మీద షాకులు ఇస్తోన్న వైసీపీ స‌ర్కార్ మ‌రో షాక్ ఇచ్చింది. ఇప్ప‌టికే డిసెంబ‌ర్ 30వ తేదీ నాటికి 40 శాతం బార్ల‌ను మూసివేస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇక ఇప్పుడు మ‌ద్యం ధ‌ర‌ల‌ను భారీగ‌గా పెంచ‌డంతో పాటు బార్ల సంఖ్య‌లోనూ భారీగా కోత విధించింది. ఇక డిసెంబ‌ర్ 30వ తేదీ నాటికి భారీగా బార్ల సంఖ్య‌ను కుదిస్తున్న‌ట్టు చెప్ప‌డంతో భారీగా లైసెన్సు ఫీజులు క‌ట్టి వ్యాపారం ప్రారంభించిన సిండికేట్లు ఇప్పుడు గ‌గ్గోలు పెడుతున్నాయి.

ఇక నెల రోజుల వ్య‌వ‌ధిలోనే ప్ర‌భుత్వం రెండోసారి మ‌ధ్యం ధ‌ర‌లు భారీగా పెంచేసింది. ఇప్ప‌టికే పెరిగిన‌ కొత్త ధరలు, బార్లు, స్టార్ హోటళ్లలో జరిగే మద్యం అమ్మకాలను పరిమితం చేశాయి. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాలు ఉద‌యం 11 నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే తెరిచి ఉంటున్నాయి. దీంతో మందు బాబులు అంద‌రూ బార్ల‌కు వెళ్ల‌డంతో అక్క‌డ మంచి డిమాండ్ ఏర్ప‌డింది.

ఈ లోపాన్ని గుర్తించిన ఏపీ ప్ర‌భుత్వం ఇప్పుడు బార్ల‌కు షాక్ ఇచ్చేలా డెసిష‌న్ తీసుకుంది. బార్ల‌లో పెంచే మ‌ద్యం ధ‌ర‌లు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌భుత్వం తీసుకున్న తాజా నిర్ణ‌యంతో డిసెంబర్ 31వ తేదీ నాటికి ప్రస్తుతమున్న బార్ల లైసెన్సులు రద్దయిపోతాయి. అయితే ఆ తర్వాత కొత్తగా ఎలాంటి విధానం అనుసరిస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

మ‌రో ఆరు నెల‌ల పాటు లైసెన్స్ ఉండ‌గానే ప్ర‌భుత్వం త‌మ బార్ల‌ను కుదిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా ల‌క్ష‌ల‌ది రూపాయ‌ల లైసెన్స్ ఫీజు క‌ట్టి బార్లు ర‌న్ చేస్తోన్న వారు అంద‌రూ గ‌గ్గోలు పెడుతున్నారు. ఇక అటు బార్ల య‌జ‌మానులు కూడా ప్ర‌భుత్వ రేటు కంటే పెంచి వ‌సూలు చేస్తున్నారు. దీంతో మందుబాబుల జేబుల‌కు భారీగా చిల్లు ప‌డుతోంది. ప్రభుత్వం కొత్తగా పెంచిన ధరల కంటే క్వార్టర్ పై రూ.20, ఫుల్ బాటిల్ పై రూ.80, బీరుపై రూ.20 నుంచి రూ.40 రూపాయల వరకు అధికంగా వసూలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news