ఎడిట్ నోట్: ‘ఉమ్మడి’ కలకలం..!

-

అనేక ఏళ్ళు కలిసి ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి 8 ఏళ్ళు దాటేసింది. ఏపీ, తెలంగాణలుగా విడిపోయింది. ఇప్పుడు ఎవరి పనిలో వారు ఉన్నారు..ఎవరి పాలన వారిది. రాష్ట్రాలు విడిపోయినా సరే ప్రజలు సఖ్యతగా..అంతా బాగానే ఉన్నారు..కానీ అనూహ్యంగా ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి..మళ్ళీ రెండు కలిస్తే తాము స్వాగతిస్తామని చేసిన వ్యాఖ్యలు..రెండు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి.

అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు..దీనిపై రచ్చ జరుగుతున్న రచ్చ ఏంటి అనేది ఒకసారి పరిశీలిస్తే..విభజన సరిగ్గా జరగలేదని, విభజన హామీలు నెరవేరచడం లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పుడు సుప్రీంలో పిటిషన్ వేశారు. దీనికి కౌంటరుగా ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చేలా పిటిషన్ వేసిందంట.  ఏపీకి సంబధించిన విభజన అంశాల గురించి వదిలేయాలని సుప్రీం కోర్టులో జగన్ ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. దీనిపై తాజాగా ఉండవల్లి ఫైర్ అయ్యారు. ఎవరి ప్రయోజనాలు  కాపాడేందుకు జగన్ ఇలా వ్యవహరిస్తున్నారని, విభజన అన్యాయం గురించి మాట్లాడటానికి జగన్‌కు భయం ఎందుకని,  జగన్ పోరాటం చేస్తారని ప్రజల్లో నమ్మకం పోతోందని చెప్పుకొచ్చారు.

ఇలా ఉండవల్లి..జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు..దీనిపై వివరణ ఇవ్వాల్సిన సజ్జల..మరో చిచ్చు లేపారు. ఉండవల్లి అరుణ్‌కుమార్ పిటిషన్ ఆధారంగా తిరిగి రెండు రాష్ట్రాలు కలిపి ఉంచాలనే పరిస్ధితి సుప్రీంకోర్టులో వస్తే దాన్ని వైసీపీ స్వాగతిస్తుందన్నారు. విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో తమ వాదనలు బలంగా వినిపిస్తామన్నారు.

రెండు రాష్ట్రాలు కలిసే అవకాశాన్నీ ఏపీ సర్కార్ ఉపయోగించుకుంటుందని, ఇరు రాష్ట్రాలు కలిసుండాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సిందేముందన్నారు. అంటే ఇక్కడ రెండు రాష్ట్రాలు కలవడం జరిగే పని కాదని అందరికీ తెలుసు. కానీ అనవసరంగా రెండు రాష్ట్రాలు కలిస్తే మంచిదే అంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలోని రాజకీయ పార్టీలు అన్నీ ఫైర్ అవుతున్నాయి. ఇదంతా పెద్ద కుట్ర అని, మోదీ డైరక్షన్‌లోనే సజ్జల ఇలా మాట్లాడారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.

కాదు ఇదంతా కేసీఆర్ కుట్ర అని, ఆయన చెప్పినట్లే సజ్జల చేస్తున్నారని బీజేపీ అంటుంది. మళ్లీ తెలంగాణలో రాజ్యాధికారం కోసం యత్నిస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్‌ అంటుంది. ఆఖరికి జగన్ సోదరి షర్మిల సైతం…సజ్జల వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. రెండు రాష్ట్రాలను కలపడం మీద కాకుండా, సొంత ప్రాంత అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఇలా సజ్జల చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. విభజన హామీలపై పోరాడతామని చెబితే బాగానే ఉంటుంది గాని..మళ్ళీ రెండు రాష్ట్రాలు కలవాలని చెప్పి మాట్లాడి..రాజకీయాన్ని డైవర్ట్ చేశారు. విభజన హామీలపై పోరాటం చేసే అంశాన్ని డైవర్ట్ అయ్యేలా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news