రైతులకు శుభవార్త.. రుణాలపై నాబార్డ్ తో జగన్ సర్కార్ కీలక ఒప్పందం !

-

నాబార్డ్‌ స్టేట్‌ క్రెడిట్‌ సెమినార్‌ 2022–23 సిఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్.. రైతులకు శుభ వార్త చెప్పారు. కోవిడ్‌ లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యవసాయరంగం మద్దతుగా నిలిచిందని.. రాష్ట్రంలో చేస్తున్న పలు కార్యక్రమాలకు నా బార్డ్, బ్యాంకులు సహాయ పడుతున్నాయని చెప్పారు. కోవిడ్‌ సమయంలో చాలా మంచి సహాయాన్ని అందించాయని.. రైతు భరోసా, సున్నావడ్డీ రుణాలు, రైతులకు ఉచిత పంటల బీమా ఇవన్నీ అమలు చేస్తున్నామని గుర్తు చేశారు.

ఆర్బీకేల ద్వారా ఇ– క్రాప్‌చేసి, పారదర్శకంగా చేస్తున్నామని.. సాగుచేస్తున్న రైతులు నష్టపోతే ఆదుకుంటున్నామనీ పేర్కొన్నారు. రైతుకు విత్తనం నుంచి పంట విక్రయం వరకూ కూడా ఆర్బీకేలు చేదోడుగా నిలుస్తున్నాయన్నారు. రైతులకు మరిన్ని రుణాలు ఇచ్చేందుకు నా బార్డ్ సహకరించాలని.. దానికి వారు కూడా అంగీకరించారని తెలిపారు.

నా బార్డ్ సహకరంతో రైతులను అడుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామ స్థాయిలో ఇ– క్రాపింగ్‌ చేస్తున్నామనీ.. వ్యవసాయ రంగంలో ఇది విప్లవాత్మక చర్య అన్నారు. గ్రామీణ నియోజకవర్గాల స్థాయిలో అగ్రి ల్యాబ్స్‌ ఏర్పాటు చేశామని.. ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో గణనీయంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. పార్లమెంటు నియోజకవర్గాల స్థాయిలో కోల్డ్ స్టోరేజ్‌ల ఏర్పాటుకు నబార్డు సహకారం కావాలని.. సహకార బ్యాంకులు, సొసైటీలను బలోపేతం చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news