Pawan Kalyan: “పవన్ కళ్యాణ్” ఫోటోలతో పెళ్లి పత్రికలు..

-

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ మరి స్టార్ హీరోలకు లేదు. పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చిపోయే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే చాలా మంది ప్రాణాలు కూడా ఇస్తారు. కొందరైతే దేవుడుతో సమానంగా చూస్తారు. మరి కొందరు ఆయనకు ఓ ప్రత్యేక స్థానాన్ని అలాగే గుర్తింపు ఇస్తారు. అయితే ఇలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లాలో ఒకటి చోటు చేసుకుంది.

తన పెళ్లి కార్డు పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో ను ముద్రించాడు ఓ వీరాభిమాని. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం జరజాం గ్రామానికి చెందిన హేమ సుందర రావు.. పవన్ కళ్యాణ్ కు చిన్నప్పటినుంచి పెద్ద ఫ్యాన్. అతడి తల్లిదండ్రులకు కూడా పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం.

దీంతో ఆ వీరాభిమాని… తాజాగా తన పెళ్లి ఉన్న నేపథ్యంలో… వెడ్డింగ్ కార్డు పై పవన్ కళ్యాణ్ ఫోటోలతో నింపేసాడు ఈనెల 4వ తారీఖున… హేమ సుందర రావు వివాహం చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే తన పెళ్లి పత్రిక పై పవన్ కళ్యాణ్ ఫోటోను ముద్రించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. అంతేకాదు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులంతా తన పెళ్లికి రావాలని విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news