నొప్పించక తానొవ్వక… జగన్ @ ఢిల్లీ!

-

ప్రస్తుతంం ఏపీ రాజకీయాల్లో జగన్ తిరుగులేని శక్తిగానే దూసుకుపోతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో 2019లో వచ్చిన గెలుపును ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా “వాపు”గా మాత్రమే చూడలేని స్థితి.. అదే విధంగా వైకాపా నాయకులు చెబుతున్నట్లు పూర్తి “బలుపు”గా కూడా పరిగణలోకి తీసుకోలేని పరిస్థితి! ఈ క్రమంలో జగన్ సుమారు 25 – 30ఏళ్లు పాలించాలనుకుంటున్నారంటూ వైకాపా నాయకులు చెబుతున్న మాటలకు న్యాయం జరగలాంటే… వ్యూహాలు ఏ రేంజ్ లో ఉండాలి?

ప్రస్తుతం జగన్ ముందు ఢిల్లీ కేంద్రంగా రెండు ఆప్షన్స్ ఉన్నాయి! అందులో ఒకటి మోడీ ఇస్తామని చెబుతున్నట్లుగా వార్తలొస్తున్న ఒక కేంద్ర మంత్రి పదవి, రెండు సహాయమంత్రి పదవులు తీసుకుని.. ఈ పూట గడిస్తే చాలు అనుకునే రాజకీయం చేయడం. మరొకటి… రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతైనా అవసరం కాబట్టి.. మీ ఢిల్లీ అవసరాలకు మేము తోడుంటాం.. మా రాష్ట్ర అవసరాలకు కేంద్ర ప్రభుత్వంగా మీరు తోడుండండని చెప్పి చక్కగా వెనక్కి రావడం! ప్రస్తుతం మోడీ & కో ఇచ్చే ఆఫర్ విషయంలో జగన్ కి ఉన్నవీ ఈ రెండే మార్గాలు!

అయితే… ప్రస్తుతం జగన్ తనకు తాను “ఒక నమ్మకమైన వ్యక్తిగా.. వైకాపాను శాస్వతమైన శక్తిగా” ఏపీ రాజకీయాల్లో తీర్చిదిద్దాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో జగన్ పార్టీ పునాదులు అత్యంత బలంగా ఉండాలి! 2019లో వచ్చిన గెలుపే బలుపు అనుకుంటే మాత్రం బోర్లా పడిపోవాల్సిన పరిస్థితి రావొచ్చు! మోడీతో జగతకడితే… జగన్ కూడా అందరిలాంటి రాజకీయ నాయకుడే అనుకోవచ్చు! అలా కాకుండా… మోడీ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించి.. నొప్పించక తానొవ్వక సిద్ధాంతంతో ముందుకు సాగితే మేలనేది కొందరి మాట!!

దానివల్ల… జగన్ తనకు తాను స్థానిక పార్టీగా బలపడటంతో పాటు.. రేపొద్దున్న కేంద్రంలో ఏదైనా రాజకీయంగా అవ్సరమైనా.. ఒక చేయి వేసి ఆదుకునే స్థాయికి చేరిపోవచ్చు! దానికి కారణం బీజేపీ సిద్ధాంతాలు వేరు, జగన్ సైద్దాంతిక బావాలు వేరు! అవ్వడమే! బీజేపీ పునాదులు వేరు.. వైకాపా కి వెన్నుదన్నుగా ఉన్న జనాలు వేరు! సో… ఈ విషయంలో తనకు తాను బలమైన “శాస్వత పునాదులు” వేసుకుని నిలబడాలని భావిస్తోన్న సమయంలో… కేంద్ర కేబినెట్ లో చేరడం వంటి “తాత్కాలిక నిర్మాణం” పని చేయరని… ఫలితంగా కేంద్ర కేబినెట్ లో చేరే విషయంలో మోడీకి నో చెప్పబోతున్నారని తెలుస్తోంది!! అదే జరిగితే మాత్రం… జగన్ శాస్వత పునాదులు వేసుకుని, పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్లే భావించొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news