జగన్‌కు తుగ్లక్ అని పేరు పెట్టింది నేనే : కొలికిపూడి శ్రీనివాసరావు

-

అమరావతి ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని రుణం తాను ఎప్పటికీ తీర్చుకోలేనని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి అన్నారు. తాను తిరువూరులో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడానికి కేశినేని చిన్నినే కారణమని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీర్వాదించారని, లోకేశ్ అవకాశం ఇచ్చారని తెలిపారు. రాజధానికి భూమిలిచ్చిన రైతులను జగన్ మోసం చేశారని ఫైర్ అయ్యారు. రాజధాని లేని రాష్ట్రానికి పెట్టుబడులు రావని, అప్పుడు ఉద్యోగులు కూడా రావని అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ కి చంద్రబాబు అవసరం చాలా ఉందని అన్నారు.నిరుద్యోగం, వెనుకబాటు తనం పరిష్కారానికి అమరావతే పరిష్కారమార్గమని ,రాజధాని నిర్మాణంతో వంద సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. అమరావతి నిర్మాణమే ఏపీ పునిర్మిర్మాణమని ఆయన అన్నారు. పేదరిక నిర్మూలన, ఆర్థిక అభివృద్ధే తన లక్ష్యమన్నారు. జగన్‌కు తుగ్లక్ అని పేరు పెట్టింది తానేనని కొలికిపూడి శ్రీనివాసరావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news