కొత్త వివాదం : బాల‌య్య మాటకు విలువ ఇవ్వ‌ని జ‌గ‌న్ ? గెలుపు ఎవ‌రిదో !

-

రాజ‌కీయం వేరు.. సినిమా వేరు..ఈ రెండూ ఒకే విధంగా ఉంటాయి కానీ ఒకే విధంగా న‌డుచుకోవు. పైకి రంగుల ప్ర‌పంచం సినిమా..పైకి క‌నిపించ‌ని రంగుల ప్ర‌పంచం రాజ‌కీయం. క‌నుక రాజ‌కీయంలో బాల‌య్య ఓడాడు. సినిమారంగంలో బాల‌య్య గెలిచాడు. అఖండ సినిమా జ‌గ‌న్ చేసిన సాయం అంతా ఇంతా కాదు కానీ ప్ర‌జాక్షేత్రంలో మాత్రం అదే వ్య‌క్తి ముఖం చాటేశారు.
దీంతో పుట్ట‌ప‌ర్తి కేంద్రంగానే స‌త్య సాయి జిల్లా ఏర్పాటు కానుంది. బాలయ్య చెప్పిన మాట‌ను ఆయ‌న వీరాభిమాని అయిన జ‌గ‌న్ నెర‌వేర్చ‌లేదు. ఇక ఆ క‌ల‌ను  మ‌రిచిపోవాల‌ని కూడా జ‌గ‌న్ వ్యాఖ్యానించార‌ని స‌మాచారం. వాస్త‌వానికి ఉగాది నుంచి ఆరంభం అయ్యే జిల్లాల ప్ర‌క్రియ‌ను తాము కూడా అడ్డుకోబోమ‌ని కోర్టు కూడా చెబుతోంది. కానీ కొన్ని వివాదాల ప‌రిష్కారానికి మాత్రం
న్యాయ స్థానం ప్రాధాన్యం ఇస్తాన‌నే అంటోంది. ఆ విధంగా కోర్టు బోనులో అనంత రాజ‌కీయం వ‌చ్చి చేరింది. అనంత దారుల్లో బాలయ్య ఓ విధంగా ఓడిపోయారు. జ‌గ‌న్ అన్ని విధాల గెలిచేందుకు ఉన్న అవ‌కాశాల‌న్నింటినీ వినియోగించుకుంటున్నారు. ఈ విష‌య‌మై బాల‌య్య లాబీయింగ్ చేయాల‌నుకున్నా కూడా జ‌గ‌న్ ద‌గ్గ‌ర సంబంధిత సూత్రాలేవీ ప‌నిచేయ‌డం లేదు అని తెలుస్తోంది.వాస్త‌వానికి చాలా రోజుల నుంచి ఓ వివాదం రాజుకుంటోంది. అదే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాజుకుంటున్న వివాదం. దీనిపై ఆ ప్రాంత ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ స్పందించారు. ప్ర‌త్య‌క్ష పోరాటాల్లోకి వచ్చారు కూడా! అదేవిధంగా అక్క‌డి నిర‌స‌న‌ల్లో పాల్గొని, అటుపై క‌లెక్ట‌ర్ ను కూడా క‌లిసి స‌మ‌స్య వివ‌రించారు కూడా ! ఇవ‌న్నీ బాగానే ఉన్నా బాల‌య్య పోరులో తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం కాలేదు. ఆవేశం వెల్ల‌డి కాలేదు. రెండ్రోజులు నిర‌స‌న‌లు, మౌన దీక్ష‌లు, బైక్ ర్యాలీలు చేసినంత మాత్రాన స‌మ‌స్య తీరిపోతుంది లేదా ప‌రిష్కారం అయిపోతుంది అని అనుకోవ‌డం సంబంధిత వ్య‌క్తుల అవివేకం కావొచ్చు. లేదా బాల‌య్య‌ను న‌డిపించే వ్య‌క్తుల అవివేకం అయినా కావొచ్చు.

ఈ ద‌శ‌లో బాల‌య్య అడుగులు త‌డ‌బడ్డాయి.ఆయ‌న చెప్పిన డైలాగులు అఖండ సినిమా స్థాయిలో ప‌బ్లిక్ డొమైన్ లో పేల‌లేదు. పైగా ఆయ‌న పోరాటం కూడా పెద్ద‌గా ఎక్కువ కాలం కొన‌సాగించ‌లేక‌పోయారు. దీంతో ఈ స‌మ‌స్య పరిష్కారానికి నోచుకోలేదు. తాజాగా హిందూపురం అఖిల ప‌క్ష క‌మిటీ మాత్రం న్యాయ పోరాటానికి సిద్ధం అయింది, హై కోర్టులో  ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం ఒక‌టి దాఖ‌లు చేసింది. ఇదే ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. అసెంబ్లీలో కూడా బాల‌య్య విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ఆఖ‌రికి చంద్ర‌బాబు బంధువు బాల‌య్య కూడా త‌మ‌నే సంప్ర‌తిస్తున్నార‌ని జ‌గ‌న్ చెప్పారు. కానీ హిందూపురం విష‌య‌మై తామేం నిర్ణ‌యం తీసుకుంటామ‌న్న‌ది చెప్ప‌లేదు.ఇక‌పై చెప్ప‌రు కూడా !

Read more RELATED
Recommended to you

Latest news