‘ ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాను యూట్యూబ్ లో రిలీజ్ చేయాలి… రాజ్యసభలో ఆప్ ఎంపీ జీరో అవర్ నోటీస్

-

దేశంలో ఇటీవల చాలా చర్చనీయాంశమై.. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న సినిమా ‘ ది కాశ్మీర్ ఫైల్స్’. 1990లో కాశ్మీర్ నుంచి పండిట్ల వలసలు, వారిపై అత్యాచారాలు, హత్యాకాండ ప్రధానాంశంగా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను రూపొందించారు. లో బడ్జెట్ ద్వారా తెరకెక్కిన ఈ సినిమా కేవలం రెండు వారాల్లోనే రూ. 200 కోట్లు వసూలు చేసింది. ఇదిలా ఉంటే ఈసినిమా రాజకీయ రచ్చకు కూడా కారణం అయింది. కేవలం ఒక వర్గానికి అనుకూలంగా తీసిని సినిమాగా కొన్ని పార్టీలు ఆరోపించాయి. బీజేపీ నాయకులతో పాటు ప్రధాని మోదీ ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ను ప్రశంసించాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ ఇచ్చాయి. అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు సినిమా చూసేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవును కూడా ప్రకటించింది.

ఇదిలా ఉంటే తాజాగా ‘ ది కాశ్మీర్ ఫైల్స్ ’ సినిమాను యూట్యూబ్, దూరదర్శన్ లో రిలీజ్ చేయాలంటూ… ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ రాజ్యసభలో జీరో అవర్ నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ది కాశ్మీర్ ఫైల్స్ ను యూట్యూబ్ లో విడుదల చేయాలని ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ, ఆప్ నేతల మధ్య విమర్శలు చెలరేగాయి.

Read more RELATED
Recommended to you

Latest news