సీఎం కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జగన్

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు 69వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Telangana CM

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ” తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీపై ఎల్లప్పుడూ భగవంతుని దీవెనలు ఉండాలని, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో చిరకాలం కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ” అని ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news