సుప్రీంకోర్టులో ఫామ్ హౌస్ కేసు విచారణ 27 కి వాయిదా

-

దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సిబిఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ఫామ్ హౌస్ కేసులో సిబిఐ విచారణకు అడ్డంకులు తొలగిపోయాయి. సిబిఐని నియంత్రించలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.

తదుపరి విచారణని ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది. అయితే విచారణ సమయంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలో వినిపించారు దుష్యంత్ దవే. ఈ కేసులో ఆధారాలన్నీ బిజెపికి వ్యతిరేకంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో కేసును సిబిఐ కి ఎలా అప్పగిస్తారని వాదించారు. కేసు పై బాధ్యతనుల కోసం మరింత సమయం కావాలని కోరారు. అయితే ధర్మాసనం మాత్రం సిబిఐని నియంత్రించలేమని కేసుని ఈనెల 27 కి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news