ఏపీ సర్పంచులకు జగన్‌ సర్కార్‌ బిగ్‌ షాక్‌..బిల్లులు మరింత జాప్యం !

-

పీ సర్పంచులకు జగన్‌ సర్కార్‌ బిగ్‌ షాక్‌ ఇచ్చింది. జాతీయ, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద పలు భవన నిర్మాణ పనులు చేపట్టిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న సర్పంచ్ లకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ‘మెటీరియల్’ పనులకు సంబంధించి సవరించిన అంచనాలను అనుమతించేది లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణఅభివృద్ధిశాఖ తాజాగా స్పష్టం చేసింది.

cm jagan
cm jagan

ఈ నిర్ణయంతో గత రెండేళ్లలో పెరిగిన సిమెంటు, ఇనుము ధరలతో ఖర్చు తడిసి మోపెడై అల్లాడుతున్న సర్పంచుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతోంది. ఉపాధి హామీ పథకంలో రూ. 8,905 కోట్ల అంచనాలతో దాదాపు 35,000 భవనాల నిర్మాణ పనులకు ప్రభుత్వం మూడేళ్ల క్రితం అనుమతులు ఇచ్చింది. వీటి నిర్మాణాలు ఈపాటికే పూర్తి కావలసి ఉంది.

చేసిన పనులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో ఇప్పటికీ సగం నిర్మాణాలు కూడా పూర్తికాలేదు. దాదాపు రూ. 1,400 కోట్ల బిల్లులు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నందున గత ఆరు నెలలుగా పనుల్లో పెద్దగా పురోగతి లేదు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన సర్పంచులు, మెటీరియల్ సరాఫరాదారులుగా పేర్లు నమోదు చేయించుకున్న అధికార పార్టీ నేతలు బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో లబోదిబోమంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news