నేను ఆనంద‌య్య క‌రోనా మందు తీసుకున్నా.. జ‌గ‌ప‌తి బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆనంద‌య్య క‌రోనా మందు గురించి ఎంత పెద్ద చ‌ర్చ జ‌రుగుతుందో చూస్తూనే ఉన్నాం. చాలామంది ఆయ‌న మందుకు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ఇక ఇప్పుడు న‌టుడు జ‌గ‌ప‌తి బాబు కూడా తాను మందు వేసుకున్నాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. మొద‌టి నుంచి ఆనంద‌య్య మందుకు ఆయ‌న మ‌ద్ద‌తు తెలుపుతూనే ఉన్నారు.

ఆనంద‌య్య | జ‌గ‌ప‌తిబాబు

ఈ క్ర‌మంలో ఈరోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ అందరికంటే ముందుగా ఆనందయ్య ఆయుర్వేద మందుని వాడిన వాళ్లలో తాను కూడా ఉన్నాన‌ని, అందుకే త‌న‌కు క‌రోనా రాలేద‌ని సంచ‌ల‌న విష‌యం వెల్ల‌డించారు. అయితే ఆ విష‌యం ఇప్పుడు చెప్పాల‌ని అనుకున్నాన‌ని వెల్ల‌డించారు.

తాను ఆయుర్వేదాన్ని న‌మ్ముతున్న‌ట్టు తెలిపారు. ఆయుర్వేదం అనేది ఎప్పుడూ మ‌నుషుల‌కు తప్పు చేయద‌ని, శరీరానికి ఎలాంటి హానిచేయద‌ని స్ప‌ష్టం చేశారు. నేచర్, భూదేవి ఎప్పుడూ హాని చేయ‌వ‌ని, ఆనంద‌య్య మందుకు అంత ప‌వ‌ర్ ఉంద‌న్నారు. ఎవడేం నమ్మినా సరే.. ఆనంద‌య్య మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండ‌వ‌ని అంద‌రూ న‌మ్మాల‌ని కోరారు. ఆనంద‌య్య మందు వ‌ల్ల త‌న‌కు క‌రోనా రాలేద‌ని స్ప‌ష్టం చేశారు.