తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలన్నీ ఈటల రాజేందర్ చుట్టే తిరుగుతున్నాయి. ఏ పార్టీ వాళ్లు అయినా సరే ఇప్పుడు ఆయన గురించే మాట్లాడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు ఆయన్ను కలుస్తూ తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాయి. అయితే ఆయన ఏ పార్టీలో చేరే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈటల రాజేందర్ పార్టీ పెడితే నష్టపోతారని జగ్గారెడ్డి తెలిపారు. ఇప్పుడు తెలంగాణలో మరో రాజకీయ పార్టీ మనుగడకు ఆస్కారం లేదని చెప్పారు. ఉన్న వారంతా ఆయా పార్టీల్లో మంచి పొసీషన్లో ఉన్నట్టు తెలిపారు.
టీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే రాష్ట్రంలో ఉంటాయని, బీసీ నాయకుడిగా ఈటలకు అంత సీన్ లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్ ఉన్న బీసీ నేత ఆర్ కృష్ణయ్యకే సాధ్యం పార్టీ మనుగడ ఈటలకు ఎలా సాధ్యం అంటూ ప్రశ్నించారు. అంటే ఈటల తమ పార్టీలో చేరితే బాగుంటుందని ఆయన ఉద్ధేశం అని అంతా అనుకుంటున్నారు.