జగ్గారెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం.. రేపు ఇంట‌ర్ బోర్డు గేటు ముందు దీక్ష‌

-

ఇటీవ‌ల ప్ర‌క‌టించిన తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్షా ఫలితాల్లో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయిన సంగ‌తి తెలిసిందే.దీంతో చాలా మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నారు. దీంతో ప్ర‌తి ప‌క్షాలు ఏక‌మై… ఇంట‌ర్ విద్యార్థుల‌కు న్యాయం చేకూరేలా ప్ర‌భుత్వం పై ఒత్తిడి తీసుకువ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

వచ్చే 12 గంటల్లో… ఇంట‌ర్ ప‌రీక్ష ఫ‌లితాల‌పై కేసీఆర్ స‌ర్కార్‌ నిర్ణయం తీసుకోవాలని.. లేదంటే రేపు ఇంటర్ బోర్డు ముందు రెండు గంటలు దీక్ష చేస్తాన‌ని హెచ్చ‌రించారు. ఉదయం 11 గంటల నుండి ఒంటి గంట వరకు దీక్ష చేస్తాన‌ని జగ్గారెడ్డి కౌంట్ డౌన్ విధించారు. ఇంట‌ర్ విద్యార్థులు ఇబ్బందులు సీఎం కేసీఆర్‌కి నచ్ఛ చెప్పడంలో సబితా ఇంద్రారెడ్డి ఫెయిల్ అయ్యారని ఆగ్ర‌హించారు. ఇంట‌ర్ కనీస మార్కులు వేసి పాస్ చేయాలని డిమాండ్ చేశారు జ‌గ్గారెడ్డి. విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న తర్వాత స్పందిస్తారా..? అని ఫైర్ అయ్యారు. మంత్రులు.. కనీసం ఆలోచన చేయకుండా ఫలితాలు ఇవ్వడం సరికాదని మండిప‌డ్డారు.

 

Read more RELATED
Recommended to you

Latest news