ఉగ్రదాడిలో బాధిత కుటుంబాలకు జమ్మూకాశ్మీర్ ఆర్థిక సాయం

-

ఉగ్రదాడిలో బాధిత కుటుంబాలకు జమ్మూకాశ్మీర్ ఆర్థిక సాయం చేయనుంది. పహల్గాం ఉగ్రదాడిలోని బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం.

Jammu and Kashmir provides financial assistance to families affected by terror attacks

కాగా పహల్గామ్ ఉగ్రదాడికి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడికి కుట్ర చేసిన టెర్రరిస్ట్ ను గుర్తించారు. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. చాపర్స్, డ్రోన్స్ తో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. కాశ్మీర్ పోలీసులతో కలిసి ఆర్మీ జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు. వీరితో పాటు రంగంలోకి దిగిన NIA బృందాలు… చాపర్స్, డ్రోన్స్ తో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. కాగా, మంగళవారం అనంత్నాగ్ జిల్లా పహల్గాంలో పర్యటిస్తున్న పలువురు పర్యటకులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్ పేర్కొనే పహల్గాంలోని బైసరన్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని అటాక్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news