ఏపీలో ఇంకా ఎన్నికలకు రెండేళ్లుపైనే సమయం ఉంది…కానీ అప్పుడే అక్కడ ఎన్నికల వాతావరణం నెలకొంది..అసలు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య ఎప్పటికప్పుడు హోరాహోరీ పోరు నడుస్తోంది. ఏదో ఇప్పుడే ఎన్నికలు జరుగుతున్న వాతావరణం సృష్టిస్తున్నారు..అంటే ఏపీ రాజకీయాలు ఎలా నడుస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక తాజాగా రాజధాని అంశంపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. ఇప్పటికే అమరావతిని రాజధానిగా కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే…అయితే జగన్ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులపైనే ముందుకెళ్తామని చెబుతుంది.
ఇప్పటికే పలువురు నేతలు మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం…తమ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందని ప్రకటించారు. అధికారంలో బలంగా ఉన్నామని, పాలనను వికేంద్రీకరించాలన్నది సీఎం జగన్ ఉద్దేశమని అన్నారు. ఎప్పటికైనా తాము అనుకున్నదే చేస్తామనే విధంగా సజ్జల మట్లాడారు. అలాగే వచ్చే ఎన్నికల్లో వికేంద్రీకరణతోనే ప్రజల్లోకి వెళ్లి వారి ఆశీర్వాదం కోరుతామని చెప్పుకొచ్చారు.
అంటే మూడు రాజధానుల కాన్సెప్ట్ పెట్టుకునే నెక్స్ట్ ఎన్నికల బరిలో దిగుతామని సజ్జల చెబుతున్నారు…అయితే గత ఎన్నికల ముందు జగన్..మూడు రాజధానుల అంశాన్ని అసలు బయటపెట్టలేదు. అప్పటికే వైసీపీ నేతలు అమరావతిలోనే రాజధాని ఉంటుందని ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక జగన్ అనూహ్యంగా మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు..ఇక దీనికి వైసీపీ శ్రేణులు మద్ధతు తెలుపుతుంటే..టీడీపీ, ఇతర పార్టీల వారు వ్యతిరేకిస్తున్నారు.
అలాగే దీనిపై అమరావతి రైతులు పోరాడుతున్నారు…ఇక కోర్టులో కేసులు కూడా పడ్డాయి..దీంతో జగన్‌కు మూడు రాజధానుల అమలు కుదరలేదు..తాజాగా కోర్టు సైతం అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చెప్పింది..కానీ మూడు రాజధానులతోనే ముందుకెళ్తామని, ఎన్నికలకు కూడా వెళ్తామని వైసీపీ చెబుతుంది. అయితే మూడు రాజధానుల కాన్సెప్ట్‌తో ఎన్నికలకు వెళితే వైసీపీకి లాభం జరుగుతుందో…నష్టం జరుగుతుందో క్లారిటీ రావడం లేదు. మరి ప్రజలు మూడుకు ఓకే అంటారో లేదో నెక్స్ట్ ఎన్నికల్లో తేలుతుంది.