ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం సొంత భూములను త్యాగం చేసిన అమరావతి రైతులకు వెనటనే వార్షిక కౌలును చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఒప్పందంలోని నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం గత యేడాది కూడా ఉల్లంఘించి ఆలస్యంగా ఇచ్చింది. వరుసగా రెండో యేడాది కూడా కౌలు చెల్లింపు జాప్యం చేస్తూ… అసలు తద్వారా డబ్బులు వస్తాయో..రావో..అనే ఆందోళనలోకి రైతాంగాన్ని నెట్టేసిందని అన్నారు.
రాజధాని రైతులకు వార్షిక కౌలు తక్షణమే చెల్లించాలి – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/tKV6cUcLCF
— JanaSena Party (@JanaSenaParty) August 26, 2020
భూములు ఇచ్చిన రైతులకు ఈ ఏడాది రూ. 189.7 కోట్ల రూపాయలను కౌలుగా చెల్లించాల్సి ఉందని పవన్ చెప్పారు. రైతులతో సీఆర్డీఏ చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించాలని అన్నారు. కరోనా సమయంలో కౌలును సరైన సమయంలో చెల్లించాలని అధికారులను రైతులు కోరారని… జనసేన కూడా ఇదే విన్నపాన్ని చేసిందని చెప్పారు. అలాగే కౌలు డబ్బులు అడిగిన రైతులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.