గ్రేటర్‌ ఎన్నికలపై జనసేన ఫోకస్‌..ఏపీలో లోకల్‌ ఫైట్‌పై పవన్‌ దృష్టి..!

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే కీలక ఎన్నికలపై జనసేన ఫోకస్ పెట్టింది..వచ్చే రెండు మూడు నెలల్లో జరగనున్న ఎన్నికలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ దృష్టి పెట్టారు..తెలంగాణలో గ్రేటర్‌..ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలల్లో గెలుపొందడానికి జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ దృష్టి సారించారు.. జనసేన పార్టీని తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం చేసేందకు కసరత్తు ప్రారంభించారు పవన్‌.. ఇందులో భాగంగా తెలంగాణలో జనసేన సంస్థాగత కమిటీలను ప్రకటించారు..విద్యార్థి, యువజన కమిటీలను పవన్‌కల్యాణ్ నియమించారు..జనసేన తెలంగాణ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా సంపత్‌ నాయక్‌ను ఎన్నుకున్నారు.. విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణను నియమించారు. అంతేకాకుంగా యువజన విభాగం అధ్యక్షుడిగా వి.లక్ష్మణ్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శిగా కిరణ్‌కుమార్‌ను నియామించారు. జనసేన సాంస్కృతిక విభాగం కార్యదర్శిగా దుంపటి శ్రీనివాస్‌ను నియమించారు.


ఏపీలో పవన్‌ కల్యాణ్‌కు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది..వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో యువత ఓట్లు కీలకంగా మారనున్నాయి..ముఖ్యంగా ఉభయ గోదావరిలో జనసేన పార్టీ ప్రభావం అధికంగా ఉంటుంది..ఇప్పటికే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్ధతు ఇస్తూ..ఏపీ బీజేపీతో కలిసి పనిచేస్తామని గతంలో పవన్ ప్రకటించారు..వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసిన అశ్చర్యపోవల్సిన అవసరం లేదు..మరోవైపు తెలంగాణలో కూడా కేసీఆర్ ప్రభుత్వంపై ఎప్పుడు ప్రత్యేక్షంగా విమర్శలు చేయనప్పటికీ..బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తుండంతో కేసీఆర్‌తో కొంత గ్యాప్‌ వచ్చినట్లు కనిపిస్తుంది..ఏపీలో మాదిరిగా తెలంగాణలో కూడా పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను గ్రేటర్‌ ఎన్నికల్లో ఓట్ల రూపంలొ వాడుకోవాలని టీ బీజేపీ యోచిస్తుంది..గ్రేటర్‌ ఎన్నికల్లో జనసేన ప్రత్యేక్షంగా పోటీ చేసే అవకాశాలు కనిపించనప్పటికీ..పార్టీ ఓట్‌ షేరింగ్ మిగతా పార్టీల గెలుపుపై ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు..ఓట్లు చీల్చడంతో తెలుగు రాష్ట్రాల్లో జనసైనికలు పాత్ర కీలకంగా మారనుంది.