మార్చి 14న జనసేన ఆవిర్భావ సభ

-

జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సభ మార్చి 14న మచిలీపట్నంలో నిర్వహించబోతున్నామని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మార్చి 14న మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి సభ ప్రాంగణానికి పవన్ కళ్యాణ్ వారాహి వాహనంలో చేరుకుంటారని తెలిపారు. దారి పొడవునా ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను తెలుసుకుంటారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే విధంగా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుస్తామని వివరించారు. పదో ఆవిర్భావ దినోత్సవ సభను మచిలీపట్నం లో నిర్వహిస్తామన్నారు. తుఫాన్ సమయంలో పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించారని.. రైతులను ఆదుకోని జగన్ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టిందన్నారు. ఆనాడు రైతులకు పవన్ అండగా నిలిచారని అందుకే మచిలీపట్నం ప్రజలు ముందుకు వచ్చి సభ పెట్టాలని‌ కోరారని మనోహర్ గుర్తు చేసుకున్నారు. 34ఎకరాల్లో ప్రత్యేకంగా సభ కోసం ఏర్పాట్లు‌ చేస్తున్నామని.. భద్రత పరంగా తగిన విధంగా అన్ని జాగ్రత్త లు తీసుకుంటామని ప్రకటించారు. మహనీయులు గురించి చాటి‌ చెప్పేలా అక్కడ ‌ప్రత్యేక‌ కార్యక్రమాలు‌ చేపడతామని.. మువ్వెన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య, ను గుర్తు చేసుకుంటామన్నారు.

Janasena party leader detained

పార్టీ ఆవిర్భావ వేదికకు పొట్టి శ్రీరాములు వేదికగా నామకరణం చేశామన్నారు. సుభాష్ చంద్రబోస్ ను స్మరించుకుంటామని తెలిపారు. సాయంత్రం జరిగే సభ కు పవన్ ఐదు గంటలకు వస్తారని.. మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి‌ వారాహి వాహనం లో‌ పవన్ కళ్యాణ్ బయలు దేరతారని మనోహర్ తెలిపారు. వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి పంపే‌ విధంగా జనసేన ప్రణాళిక ఉంటుందని స్పష్టం చేసారు. త్వరలోనే మళ్లీ ఈ సభకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని మనోహర్ తెలిపారు. ప్రజల కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడుతున్న పవన్ ను ఆదరించాలని కోరారు. వైసిపి విముక్త ప్రభుత్వాన్ని తీసుకు రావాలని.. ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసిపి కి వ్యతిరేకంగా ఓటు‌ వేయాలని పవన్ కళ్యాణ్ తరపున నేను కోరుతున్నానని తెలిపారు. పార్టీ శ్రేణులకు కూడా పవన్ తన మాటగా‌ చెప్పాలన్నారు

Read more RELATED
Recommended to you

Latest news