జోగయ్యతో జనసేనకు కష్టాలు..వైసీపీ స్ట్రాటజీ!

-

రాజకీయాల్లో గెలవడం అంటే అధికారంలోకి రావడం అనే చెప్పాలి. ఏ రాజకీయ పార్టీకైనా తుది లక్ష్యం అదే. కాకపోతే అన్నీ పార్టీలకు ఆ అవకాశం మాత్రం దక్కడం కష్టం. కానీ అన్నీ పార్టీలు అధికారం కోసమే పోరాడుతాయి. ఇప్పుడు ఏపీలో కూడా అటు వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావాలని, ఇటు టి‌డి‌పి ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. అలాగే జనసేన సైతం అధికారంలోకి రావాలని చూస్తుంది.

కాకపోతే జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారం కోసం వెంపర్లాడే నాయకుడు కాదనే చెప్పాలి. కానీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఇంకా మేలు చేయాలనే ఆలోచన పవన్‌ది. అయితే పవన్ కు గ్రౌండ్ రియాలిటీ తెలుసు. జనసేన సింగిల్ గా అధికారంలోకి రావడం కష్టమని తెలుసు. గట్టిగా కష్టపడితే ఓ 10 సీట్లు వరకు గెలుచుకోవచ్చు గాని..జనసేనకు సింగిల్ గా అధికారం ఇప్పటిలో కలే. అందుకే ఆయన టి‌డి‌పితో పొత్తుకు రెడీ అవుతున్నారు. తమ బలానికి తగ్గట్టుగా సీట్లు తీసుకుని, టి‌డి‌పితో కలిసి పోటీ చేసి వైసీపీకి చెక్ పెట్టి అధికారం దక్కించుకోవాలనేది పవన్ లక్ష్యం.

ఆ లక్ష్యం కోసమే పవన్ పనిచేస్తున్నారు..కానీ కొందరు దాన్ని చెడగొట్టడానికి చూస్తున్నట్లు కనిపిస్తున్నారు. అందులో పవన్ మేలు కోసమే పనిచేస్తున్నామని చెబుటున్న కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య కూడా ఉన్నారు. ఆయన పవన్ కు సి‌ఎం సీటు ఇచ్చి..చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని అంటున్నారు. నెక్స్ట్ టి‌డి‌పి అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ మనుగడ కష్టమని, జనసేనతో కలిస్తేనే అధికారం సాధ్యమని చెబుతున్నారు.

అయితే 40 శాతం ఓట్లు ఉన్న టి‌డి‌పి..10 శాతం ఓట్లు ఉన్న జనసేనకు సి‌ఎం సీటు ఎలా ఇస్తుందనేది పెద్ద ప్రశ్న. ఒకవేళ అదే జరిగితే టి‌డి‌పి పొత్తు పెట్టుకోదు. కానీ పవన్ కు రియాలిటీ తెలుసు కాబట్టి..రీజన్ గానే టి‌డి‌పితో పొత్తుకు రెడీ అవుతున్నారు. కాబట్టి జోగయ్య లాంటి వారు జనసేనకు నష్టం చేసేలా కాకుండా..మేలు చేసేలా రాజకీయం చేయాలని సూచనలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news