బీజేపీ లో చేరగానే పవన్ కి భారీ దెబ్బ పడింది గా?

-

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీతో చేతులు కలపడంతో ఆంధ్ర రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. నిన్న మొన్నటి వరకు గత ఎన్నికల ముందు వరకు పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీ ని దారుణమైన విమర్శలు చేయడంతో కేవలం బిజెపి పార్టీ వల్లే దేశంలో మత తత్వ గొడవలు జరుగుతున్నాయి అంటూ కామెంట్లు చేస్తూ కేవలం బిజెపి ఉత్తర భారతదేశానికి అనుకూలంగా ఉంటుంది దక్షిణ భారతదేశాన్ని చిన్నచూపు చూస్తుంది అంటూ వీర ప్రసంగాలు చేసిన పవన్ కళ్యాణ్ మీ అహంకారాన్ని అణగదొక్కుతా అంటూ బీజేపీ పార్టీ పై పెద్ద పెద్ద డైలాగులు వేసిన పవన్ కళ్యాణ్ తాజాగా బిజెపి పార్టీతో చేతులు కలపడంతో జనసేన పార్టీ కార్యకర్తలు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకత చూపిస్తున్నారు.

ఇటువంటి నేపథ్యంలో వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పవన్కళ్యాణ్ బీజేపీతో కలవడం పట్ల సెటైర్లు వేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుగా సర్పంచ్ గా లేకపోతే ఎంపీటీసీగా గెలవాలని పవన్ కళ్యాణ్ కి చాలెంజ్ చేశారు. అంతేకాకుండా ప్ర‌త్యేక హోదాపై బీజేపీ నుంచి ఎలాంటి హామీ లభించిందో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశాడు. గ‌తంలో రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం పాచిపోయిన ల‌డ్డూలు ఇచ్చింద‌ని విమ‌ర్శించిన విష‌యాన్ని వైసీపీ ఎమ్మెల్యే గుర్తు చేశాడు.

 

ఇదే తరుణంలో జనసేన పార్టీకి ముందునుండి అండగా ఉంటున్న దళితులు మరియు ముస్లింలు అనవసరంగా నిన్ను నమ్ముకుని నీ వెంట నడిచాము మమ్మల్ని హీనంగా చూసే పార్టీతో చేతులు కలిపి మమ్మల్ని మోసం చేసావు భవిష్యత్తులో దళితులు మరియు ముస్లింలు నీ మొహం చూడరు అంటూ జనసేన పార్టీలో ఉన్న దళిత మరియు ముస్లిం కార్యకర్తలు, అభిమానులు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్రస్థాయిలో విభేదించి పార్టీని విడిచి పోతున్నారు. దీంతో బీజేపీ లో పవన్ కళ్యాణ్ కలవటంతో పవన్ కళ్యాణ్ కి చాలా గట్టిగానే భారీగానే దెబ్బ పడింది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  

Read more RELATED
Recommended to you

Latest news