జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపితో పొత్తు పెట్టుకోవడం ఏమో గాని ఆంధ్రప్రదేశ్ మంత్రులు పవన్ లక్ష్యంగా విమర్శల దాడి పెంచారు. పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు పదే పదే పవన్ ని తీవ్రంగా విమర్శిస్తూనే ఉన్నారు. మంత్రులు అందరూ పవన్ మీద విరుచుకుపడ్డారు. జలవనరుల శాఖా మంత్రి అనీల్ కుమార్, రవాణా శాఖా మంత్రి పేర్ని నానీ, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్, తాజాగా పర్యాటక శాఖా మంత్రి,

అవంతి శ్రీనివాస్ పవన్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసారు. చంద్రబాబు డ్రామాలో భాగంగానే పవన్ బిజెపితో పొత్తు పెట్టుకున్నారని అవంతి ఆరోపించారు. ఆర్నెళ్ళు తిరగకుండానే వామపక్షాలకు టాటా చెప్పారని అన్నారు. పవన్ ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు, బిజెపితో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. మీరన్ని కుట్రలు చేస్తే జగన్ బలం అంత పెరుగుతుందని ఆరోపించారు. జగన్ ని తిడితే ఫలితం ఉండదు అన్నారు. పవన్ ద్వారా దొడ్డి దారిలో,
చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని ఆరోపించిన ఆయన పవన్ కి నిలకడ లేదని అన్నారు. బిజెపి ఎవరిని చేర్చుకున్నా పెద్దగా ఫలితం ఉండదు అని అన్నారు. రాష్ట్రానికి మంచి చేసి అప్పుడు ప్రజల ప్రేమను పొందాలి అన్నారు. ఆంధ్రప్రాంత ప్రజలు శాంతి కామకులు అని అభివృద్ధి చేసి ప్రజల ప్రేమను పొందాలని అన్నారు. జగన్ మీద గాని, వైసీపీ మీద కక్షతో వ్యవహరిస్తే ఉపయోగం ఉండదు అని మంత్రి అన్నారు. పోలవరం, రైల్వే జోన్ పనులకు నిధులు ఇవ్వాలని అన్నారు.