జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఒక సినీ నటుడిగా పవర్ స్టార్ గా ప్రజలు అందరూ గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారు. కానీ రాజకీయ నాయకుడిగా అనే లోపు అంతగా స్పందన రావడం లేదన్నది కాదనలేని వాస్తవం. తాజాగా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ అయిన ఇంస్టా గ్రామ్ ఖాతాను ఓపెన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఖాతాను తెరిచి కేవలం ఇది మూడవ రోజు, అప్పుడే పవన్ ను అనుసరిస్తున్న వారి సంఖ్య 2 మిలియన్ కు చేరుకుంది. కానీ ఇప్పటి వరకు ఖాతా అయితే ఉంది కానీ ఒక్క పోస్ట్ ను కూడా పెట్టలేదు. అయినా అభిమానులు ఫాలో అవుతున్నారు. ఇంకా ఒక్క రోజులోనే 1 .7 మిలియన్ సభ్యులు చేరడం రికార్డు అని చెప్పాలి. ఈ రోజుతో 2 మిలియన్ అభిమానులు తన ఇంస్టా ను ఫాలో అవడంతో ఈ విషయం ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఇక పోస్టులు పెట్టడం స్టార్ట్ చేస్తే అవి ఇంకెన్ని రికార్డులను సృష్టిస్తాయో చూడాలి.
ఇక ఇటీవల పవన్ చేసిన వారాహి యాత్ర ఉభయ గోదావరి జిల్లాల్లో సక్సెస్ అయినట్లే. కానీ ఇవి ఓట్ల రూపంలో మారుతాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది.