బండికి బంపర్ ఆఫర్ లేటు..సీటుపై నో ఆప్షన్.!

-

తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఉంది అనే దగ్గర నుంచి…అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి బి‌జే‌పినే ప్రత్యామ్నాయం అనే స్థాయికి తీసుకొచ్చింది ఎవరంటే..బండి సంజయ్ పేరు చెప్పాల్సిన పని లేదు. అంతకముందు వరకు బి‌జే‌పి ఉందంటే ఉంది..అంతే తప్ప…ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ లేదు. ఏదో సింగిల్ డిజిట్ స్థానాల్లోనే బి‌జే‌పికి పట్టు ఉండేది. ఎప్పుడైతే బండి సంజయ్ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించారో అప్పటినుంచే బి‌జే‌పి బలం పెరిగింది..కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై దూకుడుగా వెళ్ళేవారు..ప్రత్యర్ధులపై విరుచుకుపడేవారు.

ఎప్పుడూలేని విధంగా భారీ సభలు పెట్టి మోదీ మెప్పు పొందారు. రెండు ఉపఎన్నికల్లో విజయం..జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో బి‌జే‌పి సత్తా చాటడం..ఇవన్నీ బండి హయంలోనే వచ్చాయి. పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లారు. కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. పలుమార్లు అరెస్ట్ అయ్యారు. అయినా వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిలబడ్డారు. కానీ కొందరు నేతలనీ కలుపుకుని వెళ్ళడం లేదు..ఒంటెద్దు పోకడలతో ముందుకెళుతున్నారని సొంత పార్టీలో విమర్శలు రావడం బండికి మైనస్ అయింది. చివరికి అవే విమర్శల వల్ల అధ్యక్ష పదవి కోల్పోయారు.

ఇక పదవి పోయినా పార్టీకి కార్యకర్తగా పనిచేస్తానని అంటున్నారు. అయితే కేంద్రంలోని పెద్దలు…బండికి సముచిత స్థానం ఇవ్వాలని చూస్తున్నారు. కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. లేదా పార్టీలో జాతీయ స్థాయిలో కీలక పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే ఈ ఆఫర్ కాస్త లేటు అయ్యేలా ఉంది. మరో వారం రోజుల వరకు ఏ విషయం తేలేలా లేదు. ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్ లో ఉండటం, రాష్ట్రపతి ఢిల్లీలో లేకపోవడం వల్ల కేంద్ర మంత్రివర్గంలో మార్పులు ఆలస్యమయ్యేలా ఉన్నాయి.

కానీ ఏదొక కీలక పదవి మాత్రం వచ్చేలా ఉంది. అదే సమయంలో నెక్స్ట్ బండి పోటీ చేసే సీటు విషయంలో ఆప్షన్స్ లేవని తెలుస్తుంది. అధ్యక్షుడుగా ఉన్నప్పుడు వేములవాడ, కరీంనగర్ ల్లో ఏదొక చోట పోటీ చేద్దామని అనుకున్నారు. కానీ గత రెండు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కరీంనగర్ అసెంబ్లీ సీటులోనే బండి మళ్ళీ పోటీ చేస్తారని తెలుస్తుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో బండి రాజకీయం ఎలా ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Latest news