టీడీపీని బీజేపీని కలిపేందుకు పవన్ కళ్యాన్ ప్రయత్నిస్తున్నాడని మంత్రి పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబు, బీజేపీని ఎవరు కలుపుతారని చూస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ వచ్చారని అన్నారు. ఇంత సంస్కారం ఉన్న పవన్ కళ్యాణ్.. ఒక జీవితాన్ని జీవితాన్ని.. రాజకీయ జీవితం ప్రసాదించిన చిరంజీవికి నమస్కారం పెట్టకపోవడం ఏం సంస్కారం అని ప్రశ్నించారు. చిరంజీవి లేకుంటే పవన్ కళ్యాణ్ ఉన్నారా..? అని ప్రశ్నించారు. 2014లో పవన్ కళ్యాన్, చంద్రబాబుల లక్ష్యం జగన్ అధికారంలోకి రాకుండా ఇద్దరు జతకట్టారని పేర్ని నాని అన్నారు. పవన్ అంతిమ లక్ష్యం జగన్ మోహన్ రెడ్డిని ద్వేషించడమే ఆయన సిద్ధాంతం అని విమర్శించారు. వెల్లుల్లి పాయ వెల్లంపల్లి, చామంతి.. అవంతి అని తిడుతూ.. మీరు మాత్రం మానసికి అత్యాచారం చేయొచ్చు కానీ.. మేము మాత్రం మిమ్మల్ని ఏమన కూడడా.. మీకు ఒక్కడికే మనసు ఉంటుందా..? అని ప్రశ్నించారు. 2014-19 వరకు మీ వల్ల ఏం ప్రయోజనం జరిగిందని ప్రశ్నించారు. మీరు ఉద్ధానం వెళ్లి ఏం చేశారు అని పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు మన పార్టీలోకి దూకుతారో.. అని టీడీపీ కార్యకర్తలు చూస్తున్నారని పేర్ని విమర్శించారు.
రాజకీయ జీవితం ఇచ్చిన చిరంజీవికి నమస్కారం చేయకపోడం పవన్ సంస్కారం: పేర్ని నాని
-