తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ కి వెళ్లి ఎంతమంది హీరోయిన్స్ సక్సెస్ అయ్యారు. అలాంటి వారిలో శ్రీదేవి కూడా ఒకరు ఆమె ఎన్నో సంవత్సరాల పాటు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలిగింది. అలా స్టార్డం తగ్గిపోయిన తర్వాత తన నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలలో నటిస్తూ మెప్పించిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయిలో మరణించింది. అయితే శ్రీదేవి మరణానికి గల కారణాలు ఇంకా మిస్టరీగానే మిగిలిపోయాయి. ఇక శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి అంటే తనకి చాలా ఇష్టమట జాన్వి కూడా.. తన తల్లి శ్రీదేవి అంటే ఎక్కువగా ప్రాణం ఇచ్చేదట.తల్లి చనిపోయిన నాలుగేళ్లు కావస్తున్నప్పటికీ తరచు ఆమె గురించి పలు విషయాలను తెలియజేస్తూ ఉంటుంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో జాన్వి కపూర్ తన తల్లి గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. జాన్వి కపూర్ మాట్లాడుతూ.. తన తండ్రి బోనికపూర్ కు సిగరెట్ తాగే అలవాటు మార్చడానికి ఆమె చేసిన ప్రయత్నాన్ని సైతం వివరించింది. జాన్వి ఇలా తెలియజేస్తూ అది చాలా ఏళ్ల క్రితం నాటి సంగతి మేము అప్పుడు జూహు లోని ఇంట్లో ఉంటున్నాం. నాన్న బాగా సిగరెట్లు తాగే వారు నేను ఇంకా సినిమాల్లోకి రాని సమయం అది.. ఇక తను తన చెల్లెలు ఖుషి ఇద్దరు కలిసి తన తండ్రి తాగే సిగరెట్ ప్యాకెట్లను వెతికి మరి నాశనం చేసే వాళ్ళమని తెలిపింది.
ఇక తన తల్లి కూడా నాన్నతో ఇదే విషయంపై ఎప్పుడు పోట్లాడేది అంటూ తెలియజేసింది దీంతో తన తల్లి ఒక కీలక నిర్ణయం తీసుకుందని తెలియజేసింది. ఇక తన తండ్రి సిగరెట్లు మానేసే వరకు మాంసాన్ని ముట్టుకోనని శపధం చేసిందట శ్రీదేవి. అయితే శ్రీదేవి మాంసం తినకుంటే నీరసంతో పడిపోయేదట దీంతో ఆమెను మాంసం తినమని డాక్టర్లు హెచ్చరించారట. అయినా కూడా తన తల్లి వినలేదని నాన్న కూడా ఎంతో చెప్పి చూసిన అమ్మ వినలేదని.. చివరికి అప్పుడు చేయలేకపోయినా ఇప్పుడు చేస్తానని తన తండ్రి చెప్పినట్లు చెప్పుకొచ్చింది జాన్వి కపూర్. ప్రస్తుతం జాన్వి చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.