తెలంగాణా రాజకీయాలను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే చిన్న ప్రచారం కూడా బలంగా చేస్తూ ఉంటారు. వైసీపీ మీద తెలుగుదేశం, తెలుగుదేశం వైసీపీ ఏదోక ప్రచారంతో సందడి చేస్తూ ఉంటారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. రాజకీయాలకు జనాల మీద ఆసక్తి కూడా సోషల్ మీడియా వచ్చిన తర్వాత పెరిగింది. అందుకే రాజకీయ నాయకులు కూడా సోషల్ మీడియా మీద ఎక్కువగా దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో జరిగిన సందడి అంతా ఇంతా కాదు.
ఇప్పుడు ఎన్నికలు అయ్యాయి జగన్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. టీడీపీ మీద వైసీపీ చేసే ప్రచారం ఏమో గాని వైసీపీ మీద, జగన్ మీద తెలుగుదేశం ఒక ప్రచారం ఇప్పుడు ఎక్కువగా చేస్తుంది. గత 20 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక వార్త హాట్ టాపిక్ గా మారింది. జగన్ కి జనవరిలో బెయిల్ రద్దవుతుంది అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. జనవరి 7 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిణామాలు మారతాయని అంటున్నారు. 70 మంది ఎమ్మెల్యేలు బిజెపిలోకి వెళ్ళే అవకాశం ఉందనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి.
కేంద్రం రంగంలోకి దిగుతుందని, జనవరి తర్వాత జగన్ జాతకం ఎంత మాత్రం బాగోలేదని, అందుకే సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నారని అంటున్నారు. తెలుగుదేశం సోషల్ మీడియా ఈ ప్రచారం నిజం కావాలని కూడా కోరుకోవడం గమనార్హం. సోషల్ మీడియా ప్రచారమే తెలుగుదేశం కొంప ముంచినా తమ్ముళ్ళు మాత్రం వాటిని నమ్మడం గమనార్హం. జగన్ లో జనవరి భయం ఎక్కువగా ఉందని, అమిత్ షా అందుకే కలవడం లేదని చెప్పడం మరింత ఆశ్చర్యం. ఈ వ్యాఖ్యలు చూసి వైసీపీ కార్యకర్తలు నవ్వే పనిలో ఉన్నారు.