ఇదేందిరా బాబు..ఈ రైలుకు ఇంధనం అవసరం లేదట..మరీ..!!

-

కొందరికి వచ్చే ఆలోచనల ముందు వాటిని కనిపెట్టిన వాళ్ళు కూడా వేస్టు అనే చెప్పాలి.. ముఖ్యంగా జపాన్ దేశస్తులు చేస్తున్న కొన్నిటికి మనం తప్పక లైకు వేసుకోవాల్సిందే..అంతేకాదు వాటిని తయారు చేసిన విధానం చూస్తే గమ్మత్తుగా కూడా ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి ఒక రైలును తయారు చేశారు.దానికి ఎటువంటి ఇంధనం అవసరం లేదని జపనీయులు అంటున్నారు. ఇక ఆలస్యం ఎందుకు అదేందో ఇప్పుడు ఓ లుక్ వేద్దాము రండి..

జపనీయులు కనిపెట్టే కొన్ని ఆవిష్కరణలు మిగతా ప్రపంచం చేత ఔరా అనిపిస్తాయని అనడంలో సందేహం లేదు. తాజాగా అలాంటి అద్భుతమైన ఆవిష్కరణకు కార్యాచరణ చేశారు.జపాన్ శాస్త్రవేత్తలు తాజాగా రామెన్‌ సూప్‌, ఇతర ఆహార పదార్థాల వ్యర్థాలతో ఓ ట్రైన్‌ని సక్సెస్‌ఫుల్‌గా నడిపి చరిత్ర సృష్టించారు. ఆవిరి, డీజిల్, ఎలక్ట్రిసిటీతో మాత్రమే నడిచే ట్రైన్లను ఇప్పటివరకు మనం చూశాం. కానీ ఆహార పదార్థాలతో ట్రైన్ నడపడం జపనీయులకే సాద్యపడింది.

జపాన్‌లోని టాకచిహో అమటెరసు అనే రైల్వే కంపెనీ రైళ్లలో వాడే ఫ్యూయల్‌కి ప్రత్యామ్నాయంగా ఏదైనా తీసుకురావాలని అనుకుంది. ఆ సమయంలోనే వారికి ఆహార పదార్థాల వ్యర్థాలపై దృష్టి మళ్ళింది. సాధారణంగా జపాన్ ప్రజలు పంది ఎముకలతో చేసే టొంకుట్సు రామెన్‌ సూప్‌, కూరగాయలు/ మాంసంతో చేసే టెంపురా వంటకాలను అధికంగా తింటూ ఉంటారు. అయితే ఈ ఆహార పదార్థాలు ఎక్కువగా వ్యర్థాలుగా మిగిలి పోతుంటాయి. దీనివల్ల దేశంలో వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన రైల్వే కంపెనీ వెంటనే ఆ ఆహార పదార్థాల వ్యర్థాలు నుంచి బయో డీజిల్ తయారు చేయాలనే వినూత్న ఆలోచన చేసింది. ఈ బాధ్యతను నిషిడా షౌన్‌ అనే కంపెనీకి అప్పజెప్పింది..ఆ సంస్థ బయో ఇంధనాన్ని తయారు చేసింది.

బయో డీజిల్‌తో కొన్ని రైలింజన్లను విజయవంతంగా నడపడం సాధ్యం అయ్యింది. దాంతో రైల్వే కంపెనీ తెగ ఖుషి అయిపోయింది. అంతేకాదు ఈ సక్సెస్‌ఫుల్‌ ప్రయోగాన్ని ప్రపంచానికి తెలిసేలాగా కొద్ది రోజుల క్రితం మియాజాకీ నగరంలో ఓ సైట్-సీయింగ్ ట్రైన్‌ను బయో డీజిల్‌తో నడిపించింది. ఈ రైలు వెళ్తున్నప్పుడు దాన్నుంచి వచ్చే పొగలు అనేవి ఆహారపదార్థాల వాసనను వ్యాప్తి చేశాయని ప్రయాణికులు అన్నారు..ఈ రైలుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది..

Read more RELATED
Recommended to you

Latest news