టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అతని కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.. ఇక తాజాగా వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్ట్ అయిన తండ్రి కొడుకులను అనంతపురం పోలీస్ కస్టడీ నుండి కడప జైలుకు తరలించారు. పోలీస్ కస్టడీ ముగియడంతో వారిని ఈరోజు అనంతపురం కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు వారిని కడప జైలుకు తరలించవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. కాగా, జేసీ సతీమణి ఉమా తన భర్త పై కుమారుడిపై నిదామోపేందుకే ప్రభుత్వం అక్రమంగా కేసులు మోపారని వారిపై నమోదు చేసిన కేసును రద్దు చేస్తూ కోర్టు ఆదేశాలు ఇవ్వవల్సిందిగా పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు తమ పిటిషన్లను అంగీకరించి తదుపరి జరగవలసిన చర్యలను నిలిపివేయాలని ఆమె ఆ పిటిషన్లో కోరింది.
జేసీ ప్రభాకర్ రెడ్డి అతని కుమారుడిని కడప జైలుకు తరలింపు..!
-